Auroville City : ఇలాంటి సిటీని జీవితంలో చూసి ఉండరు.. ఆరోవిల్ సిటీ ప్రత్యేకతలు ఇవీ

డబ్బు, కులం, మతం వంటి వాటితో సంబంధం లేకుండా అందరిని సమానంగా చేసే ఈ నగరం పేరు ఆరోవిల్ సిటీ. ఇది చెన్నై నగరానికి 150 కి.మీ దూరంలో విల్లుపురం జిల్లాలో ఉంది. ఈ అందమైన నగరాన్ని సన్ ఆఫ్ డాన్, సిటీ ఆఫ్ డాన్ అని కూడా పిలుస్తారు.

Written By: Kusuma Aggunna, Updated On : August 29, 2024 7:14 pm

Auroville City

Follow us on

Auroville City :  ఇప్పటికీ ఎప్పటికీ డబ్బు ప్రపంచాన్ని ఏలుతుంది. అన్ని కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. మనిషికి తిండి, బట్ట, గూడు ఎంత ముఖ్యమూ డబ్బు కూడా ఈరోజుల్లో అంతే ముఖ్యం అయిపోయింది. బంధాలు, బంధుత్వాల కంటే డబ్బుకే విలువ ఇస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా డబ్బు అవసరం లేకుండా ఓ నగరం ఉందంటే ఆశ్చర్యమే. ఈ నగరంలో అందరికీ ఒకే రూల్ ఉంటుంది. అందరూ కూడా సమానమే. ఇక్కడ డబ్బు, మతం, కులం, అంటరానితనం వంటివి అస్సలు ఉండవు. ఇంతకీ ఆ సిటీ పేరు ఏంటి? ఇంత అందమైన సిటీ ఎక్కడ ఉంది? ఈ సిటీని చేరుకోవడం ఎలా? పూర్తి వివరాలు తెలియాలంటే లేటు చేయకుండా స్టోరీలోకి వెళ్దాం.

డబ్బు, కులం, మతం వంటి వాటితో సంబంధం లేకుండా అందరిని సమానంగా చేసే ఈ నగరం పేరు ఆరోవిల్ సిటీ. ఇది చెన్నై నగరానికి 150 కి.మీ దూరంలో విల్లుపురం జిల్లాలో ఉంది. ఈ అందమైన నగరాన్ని సన్ ఆఫ్ డాన్, సిటీ ఆఫ్ డాన్ అని కూడా పిలుస్తారు. ఇందులో నివసించే ప్రజలు కేవలం ఒకే దేశానికి చెందిన వాళ్లు కారు. వీళ్లకు ఎలాంటి కులాలు, మతాలు, సంప్రదాయలు, ఆచారాలు, పౌరసత్వం ఏవి ఉండవు. ఈ సిటీలో దాదాపు మూడు వేల మంది ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న వ్యక్తి అయిన కూడా ఈ ఆరోవిల్ సిటీలో జీవించవచ్చు. ఈ సిటీని ఆధ్యాత్మిక గురువు మీరా మదర్ 1968లో స్థాపించారు. ప్రపంచంలోని మనుషులు అంతా సమానమే. ఎలాంటి బేధాలు లేకుండా అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ జీవించే ప్రజలు డబ్బులు ఉపయోగించారు. వాళ్ల పనులకు, చేసిన సేవలకు ఒకరి దగ్గరి నుంచి డబ్బులుకి బదులుగా ఆరో డెబిట్ కార్టును వాడుతారు. మొదటి నుంచే దీనిని డబ్బు రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కృషి చేసింది.

ఈ ప్రపంచాన్ని డబ్బు శాసిస్తుంది. మరి డబ్బు లేని సమాజాన్ని సృషించాలని ఎన్నో ప్రయోగాలు చేసింది. అందరికీ అవసరమయ్యే నిత్యావసరాల సరుకుల కోసం ఉచిత పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ఒకరి అవసరాలను మరొకరు తీర్చుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలా నగదు రహిత గ్రామంగా మార్చారు. దీనికోసం ఎంతగానో కష్టపడ్డారు. ఒకానొక సమయంలో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ చో జే వీన్ ఎకో ఫ్రెండ్లీ బీవీ టాయిలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా చేశారు. విసర్జిత పదార్థాలతో పవర్ జనరేట్ అయ్యేలా చేస్తుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత జీగూల్ కరెన్సీ యాప్, ఆరో అనే మొబైల్ అప్లికేషన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నగరంలో ప్రజలు ఎవర్ని పూజించరు. ఇక్కడ నివసించాలంటే సేవకుడిగా ఉండాలి.