Husband And Wife Relationship: భార్యాభర్తల బంధంలో అన్యోన్యత ముఖ్యం. అనురాగంతో ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ పెరుగుతుంది. కుటుంబంలో ఇద్దరి మద్య ఆప్యాయత పెరిగితే కాపురం పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. అందుకే కాపురంలో కలతలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాపురంలో గొడవలు రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే మంచిది.
ఇద్దరి మధ్య సఖ్యత
కాపురంలో ఇద్దరి మధ్య సఖ్యత కావాలంటే ఇద్దరు సన్నిహితంగా ఉండాలి. ఇష్టాఇష్టాలను గౌరవించుకోవాలి. అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఒప్పుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య స్పష్టమైన అవగాహన ఉంటే ఎలాంటి గొడవలు రావు. విభేదాలు లేకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి.
విశ్వాసం
ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. భాగస్వాముల మధ్య విశ్వసనీయత ముఖ్యం. ఆరోగ్యకరమైన బంధం ఏర్పడాలంటే ఇద్దరు పరస్పరం అభిప్రాయాలు పంచుకోవాలి. ప్రేమకు నమ్మకం పునాది అనుమానం సమాధి. ఇద్దరి మధ్య నమ్మకం కోల్పోతే ఇబ్బందులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంతో ముఖ్యమైనది. అది కోల్పోయిన నాడు సంసారం కకావికలమే.
ఆర్థిక సమస్యలు
కాపురంలో కలతలు రావడానికి ప్రధాన కారణాల్లో ఆర్థిక ఇబ్బందులు ప్రముఖమైనవి. భార్యాభర్తల బంధంలో ఒత్తిడి, టెన్షన్ తో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆలుమగల మధ్య అనురాగం తలెత్తాలంటే అభిప్రాయ భేదాలు రాకూడదు. ఇద్దరు నిర్లక్ష్యంగా ఉంటే కాపురంలో గొడవలు తారాస్థాయికి చేరతాయి. దీంతో భార్యాభర్తలో అనుబందం పెరగడానికి ఏకాభిప్రాయం ముఖ్యం.