Lakshmi Narasimha Movie: బాలకృష్ణ ‘లక్ష్మి నరసింహ’ చిత్రాన్ని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..!

ఈ సినిమా బాలయ్య చేతుల్లోకి రావడానికి ముందు చాలా జరిగిందట. అప్పట్లో తమిళనాడు ని ఒక ఊపిన సామీ చిత్రాన్ని, డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ చూసి ఎంతో నచ్చాడట, ఆ తర్వాత నిర్మాత బెల్లంకొండ సురేష్ కి ఈ చిత్రాన్ని చూడమని సూచించాడట జయంత్. ఇది తెలుగు లో రీమేక్ చేస్తే పెద్ద హిట్ అవుతుందని,ఈ సినిమాని మనం అక్కినేని నాగార్జున తో చేస్తే కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుందని నిర్మాత సురేష్ తో అన్నాడట జయంత్ సి పరాన్జీ. ఎందుకంటే నాగార్జున అంతకు ముందే శివమణి సినిమాలో పోలీస్ క్యారక్టర్ తో దుమ్ము లేపేసాడు.

Written By: Vicky, Updated On : May 10, 2023 2:50 pm

Lakshmi Narasimha Movie

Follow us on

Lakshmi Narasimha Movie: నందమూరి బాలకృష్ణ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాలలో ఒకటి ‘లక్ష్మీ నరసింహా’. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన బాలయ్య కి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది ఈ చిత్రం. తమిళం లో విక్రమ్ హీరో గా నటించిన ‘సామీ’ చిత్రానికి ఇది రీమేక్. అప్పట్లోనే ఈ సినిమా సుమారుగా 18 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది, అంతే కాకుండా 87 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం.

అయితే ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతున్న సమయం లోనే బాలకృష్ణ మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ మధ్య గొడవలు రావడం, బాలయ్య అదుపు తప్పిన కోపం తో బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరగడం వంటివి అప్పట్లో ఎలాంటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఇప్పటికీ ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా బాలయ్య చేతుల్లోకి రావడానికి ముందు చాలా జరిగిందట. అప్పట్లో తమిళనాడు ని ఒక ఊపిన సామీ చిత్రాన్ని, డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ చూసి ఎంతో నచ్చాడట, ఆ తర్వాత నిర్మాత బెల్లంకొండ సురేష్ కి ఈ చిత్రాన్ని చూడమని సూచించాడట జయంత్. ఇది తెలుగు లో రీమేక్ చేస్తే పెద్ద హిట్ అవుతుందని,ఈ సినిమాని మనం అక్కినేని నాగార్జున తో చేస్తే కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుందని నిర్మాత సురేష్ తో అన్నాడట జయంత్ సి పరాన్జీ. ఎందుకంటే నాగార్జున అంతకు ముందే శివమణి సినిమాలో పోలీస్ క్యారక్టర్ తో దుమ్ము లేపేసాడు.

అయితే ఈ రీమేక్ చేద్దామని నాగార్జున వద్దకి వెళ్ళినప్పుడు, గత ఏడాదే పోలీస్ క్యారక్టర్ చేశాను, మళ్ళీ అదే క్యారక్టర్ చేస్తే ఆడియన్స్ కి బోర్ కొడుతుందని, నాకంటే ఈ కథ బాలయ్య గారికి బాగుంటుందని, ఆయనని కలిసి ఈ కథ చెప్పండి అని నాగార్జుననే స్వయం గా రికమెండ్ చేసాడట, అలా ఈ చిత్రం చివరికి బాలయ్య చేతికి చేరింది.