Team India T20 World Cup: టీమిండియా ఆసియా కప్ 2022లో రెండు పరాజయాలతో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వరుస విజయాలతో ఉన్న టీమిండియాకు శ్రీలంక, పాకిస్తాన్ జట్లతో ఓటమి చెందడంతో టోర్నీ నుంచి వైదొలిగింది. టీమిండియాలో వైఫల్యాలు బయటపడ్డాయి. దీంతో టీమిండియా ప్రయోగాలు విఫలం కావడంతో బ్యాటింగ్, బౌలింగ్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ జరుగుతుండటంతో జట్టు కూర్పుపై యాజమాన్యం ఫోకస్ చేయాల్సిన సమయం వచ్చింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తో జరిగే సిరీస్ లో రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ లు టీం ఏర్పాటుపై మల్లగుళ్లాలు పడుతున్నారు.

టీమిండియాలో మిడిలార్డర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు రాణిస్తున్నా మిడిలార్డర్ సరైన సమయంలో తన ప్రతాం చూపించలేకపోవడంతో వైఫల్యం ఏర్పడుతోంది. ఆసియా కప్ లో పరాజయం వెంటాడటంతో టీమిండియాకు ఓటమి పలకరించింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లి రాణించినా మిడిలార్డర్ లో వచ్చిన హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ విఫలం కావడంతో విజయం దక్కకుండా పోయింది. చివరిదాకా క్రీజులో ఉండాల్సిన వారు ఔట్ కావడంతో చేదు అనుభవాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది.
వికెట్ కీపర్ విషయంలో కూడా దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ లకు పోటీ ఏర్పడింది. ఇద్దరిని ఆడించే పరిస్థితి లేదు. దీంతో లెఫ్ట్ రైట్ హ్యాండ్ లను పరిగణనలోకి తీసుకుని పంత్ కే పట్టం కడుతున్నారు. పంత్ లెఫ్ట్ హ్యాండ్ కావడంతోనే అతడికి అవకాశాలు వస్తున్నాయి. కానీ అతడు జట్టును కీలక పరిస్థితుల్లో ఆదుకోవడం లేదు. దినేష్ కార్తీక్ అయితే జట్టుకు సేవలు అందించడంలో ముందుంటున్నాడు. బ్యాటింగ్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో దినేష్ ను కాదని పంత్ కు అవకాశమిచ్చి టీమిండియా చేయి కాల్చుకుంది. చేదు ఫలితం ఎదుర్కొని ఓటమి భారంతో కుంగిపోయింది.
ఇక రవీంద్ర జబేజాను కూడా కావాలనే పక్కన పెడుతుండటంతో జట్టుకు నష్టమే కలుగుతోంది. అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవరు లేకపోవడంతో నెంబర్ 4 లో వచ్చే ఆటగాడి కోసం టీమిండియా ఎదురు చూస్తోంది. నాలుగోస్థానం బ్యాట్స్ మెన్ కోసం ఎంత వెతికినా అతడి స్థానం భర్తీ చేసే ఆటగాడు కనిపించడం లేదు. దీంతోనే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నాలుగో ఆటగాడిగా జబేజాతో చేసిన ప్రయోగాలు విఫలం అయ్యాయి. జడేజా గాయంతో ఉండటంతో పంత్ కు అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. జడేజా గైర్హాజరుతో మేనేజ్ మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.

బీసీసీఐ నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో బుమ్రా, హర్షల్ పటేల్ లు కోలుకున్నా టోర్నీకి మాత్రం దూరమయ్యారు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగితే సమస్య ఉండదని తెలిసినా ఎవరికి అవకాశం ఇవ్వాలో తెలియడం లేదు. దీంతో వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచ కప్ లో విజయం దక్కించుకుని ఆసియా కప్ లో పోయిన పరువును నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ నాలుగు విషయాలపై ఫోకస్ పెట్టి టీంను ఫామ్ చేసుకోవాలని చూస్తున్నారు. దీనికి గాను రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు.