Apple: రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు పోవాల్సిన ఉండదు అని చెబుతుంటారు. ఆపిల్ కు ఉన్న ప్రాధాన్యం అలాంటిది మరి. పండ్లో అతి ముఖ్యమైన పండుగా ఆపిల్ ను చూస్తారు. తినడానికి కూడా అందరు ముందుంటారు. నేను తినను అని చెప్పేవారు మాత్రం ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆపిల్ ను తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆపిల్ అన్ని కాలాల్లో మనకు లభించే పండు. ఏ కాలమైనా అందుబాటులో ఉంటుంది. ఏ రకమైన జబ్బులున్నా సరే ఆపిల్ ను తినడంతో లాభమే జరుగుతుంది. మధుమేహం, రక్తపోటులకు కూడా ఆపిల్ బాగానే పనిచేస్తుంది. అందుకే దీన్ని తినడంతో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

ఆపిల్ ను ఎలా తినాలి? తొక్కతో తింటే మేలా? తొక్క తీసి తింటేనే ప్రయోజనమా అనేది అందరికి సందేహంగా అనిపిస్తోంది. కొందరు తోలుతో తినాలని చెబితే మరికొందరు తొక్క తీసేసి తినాలని ఉచిత సలహా ఇస్తున్నారు. తోలుతో తింటే పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయి. దీంతో పోషకాలు మెండుగా దక్కాలంటే తొక్కతో తింటేనే మంచిదని చెబుతున్నారు. తొక్కతో తింటే అందులో ఉండే రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమున్నందున తొక్క తీస్తేనే మంచిదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
తొక్కలోనే పుష్కలంగా ప్రొటీన్లు ఉండటంతో తొక్కతోనే తింటే మేలు. కానీ తొక్క తీస్తేనే మంచిదని కొందరు చెబుతున్నారు. తొక్కతో తినాలంటే తినే ముందు గోరువెచ్చని నీటిలో కడిగి తింటే ఏ రకమైన ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఆపిల్ ను తొక్కతో తింటేనే అన్ని రకాల ప్రయోజనాలు దక్కుతాయి. తొక్క తీసేస్తే మనకు ప్రొటీన్లు దక్కవు. అందుకే ఆపిల్ విషయంలో తొక్కతోనే తినాలని సూచిస్తున్నారు. తొక్క తీసేస్తే పోషకాలు పోయినట్లే. ఆపిల్ తినడంలో కూడా ఇన్ని రకాల ప్రయోజనాలు దాగి ఉండటంతో ఆపిల్ ను నిత్యం తీసుకుని ఆరోగ్యవంతులుగా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తొక్కతో తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. తొక్కతో తినేందుకు తయారైనప్పుడు దాన్ని వేడి నీటిలో బాగా కడిగి తింటే అందులో ఉండే రసాయనాలు ఆవిరి అయిపోతాయి. అందుకే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆపిల్ తినేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆపిల్ ను కడగకుండా తింటే అనర్థాలు వస్తాయని తెలియడంతో తొక్క తీయకుండా తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తొక్క తీస్తే ఎలాంటి లాభం ఉండదని తెలియడంతో అందరు తొక్కతోనే తిన్నా కడుక్కుని తినాల్సిందని చెబుతున్నారు.