Fish and Milk: చేపలు మనకు మంచి పోషకాలు ఉన్న ఆహారం. వాటిని తీసుకుంటే ఆరోగ్యం కలుగుతుంది. వీటిని తింటే ఒమేగా 3 వల్ల మన ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో చేపలు తింటే ఎంతో మేలని తెలుస్తోంది. చేపల వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయనడంలో సందేహం లేదు. చేపలు త్వరగా జీర్ణం అవుతాయి. అందుకే వాటిని వారంలో కనీసం రెండు సార్లు తీసుకోవచ్చు. ఫలితంగా మనకు ఒనగూడే లాభాలతోనే మనకు చేపలు మంచి ఆహారమని చెబుతుంటారు.

చేపలు తిన్న తరువాత వెంటనే కొన్ని పదార్థాలు తీసుకుంటే నిష్ర్పయోజనమే. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేపలు వేడిగా ఉన్నప్పటికంటే మరునాడు తింటే ఇంకా రుచిగా ఉంటుంది. మాంసం 72 గంటలు, చికెన్ 36 గంటలు, చేపలు 7 గంటల సమయం మనకు జీర్ణం కావడానికి పడుతుంది. అందుకే చేపలు తొందరగా అరగడంతో ఎక్కువగా తీసుకున్నా లాభమే. పైగా గుండె జబ్బులకు చేపలు మేలు చేస్తాయని వైద్యులే స్వయంగా వెల్లడిస్తుండటంతో చాలా మంది చేపలు తినడానికి మొగ్గు చూపుతున్నారు.
చేపలు తిన్న వెంటనే పెరుగు తినకూడదు. మజ్జిగ తాగకూడదు. ఇవి తీసుకుంటే మనకు అనారోగ్యమే. ఎందుకంటే చేపలు వేడిగా ఉంటాయి. పెరుగు, మజ్జిగ చల్లగా ఉండటంతో చర్మవ్యాధులు చుట్టుముడతాయి. ఇందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు మనకు నష్టం కలిగిస్తాయి చేపలు తిన్న తక్షణమే ఐస్ క్రీంలు కూడా తినకూడదు. అది కూడా చల్లగా ఉంటుంది. అందుకే చేపలు తిన్న తరువాత వీటిని తీసుకోవడం అంత మంచిది కాదు. ఇంకా కాఫీ, టీలు కూడా తాగకూడదు.

చేపలు మంచి ఆహారమే. కానీ అవి తిన్న తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు నష్టమే. చేపలు తిన్న వెంటనే చికెన్ కూడా తీసుకోకూడదు. దీంతో ప్రతికూల ప్రభావం ఏర్పడుతంది. చికెన్ లో ఉండే ప్రొటీన్లు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో చేపలు తిన్న తరువాత ఏం తినకుండా ఉండాలి. పొరపాటున తీసుకుంటే మనకు అనర్థాలే ఎక్కువ. చేపలను తీసుకోవడంలో మనకు ఉత్సాహం ఉన్నా మరుక్షణమే ఇతర పదార్థాలు తీసుకుంటే మనకు ఇబ్బందులే ఎదురవుతాయి.