
Ugadi Pachadi: తెలుగు వారికి ఇష్టమైన పండుగల్లో ఉగాది ఉంటుంది. తెలుగు సంవత్సరం మొదలైందే ఈ రోజుగా భావిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది ప్రాంతాల్లో ఉగాదిని జరుపుకుంటారు. ఈ రోజు పచ్చడి తయారు చేసుకుంటాం. ఉగాది పచ్చడి తినందే ఏ పదార్థాన్ని కూడా తీసుకోం. అంతటి విశిష్టత కలిగిన పచ్చడిలో ఎన్నో ఔషధాలు దాగి ఉన్నాయి. అందుకే ఉగాది పచ్చడిని రుచి చూశాకే ఇతర ఆహారాలు తీసుకుంటాం. ఆరు రుచుల కలయికతో తయారు చేసిన పచ్చడి ప్రాముఖ్యత తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీంతో జీవితంలో కష్ట సుఖాలను సూచిస్తాయని నమ్ముతుంటారు. అందుకే ఉగాది పచ్చడిని ఇష్టంగా తింటారు.
ఉగాది పచ్చడిలో తీపి, కారం, పులుపు, ఉప్పు, వగరు, చేదుల కలయిక ఉంటుంది. బెల్లం, చింతపండు, ఉప్పు, పచ్చిమిర్చి, మామిడికాయ, వేపపువ్వును ఉపయోగిస్తారు. కొంత మంది అరటిపండు, కొబ్బరి తురుము, పుట్నాల పప్పును తీసుకుంటారు. ఉగాది పచ్చడి అంటే అందరికి ఇష్టమే. ఏడాదంతా మనకు అన్ని సమభాగంలో ఉండాలనే ఉద్దేశంతోనే పచ్చడి తయారు చేస్తుంటారు. ఏడాదంతా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలిచేందకు చేయూతనిచ్చే రుచులే ఇవి. అందుకే దీన్ని అందరు తింటారు.
పచ్చడిలో వాడే ప్రతి పదార్థము మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే దీన్ని తాగేందుకు ప్రాధాన్యం ఇస్తారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాతావరణాన్ని తట్టుకునేందుకు వాడుతారు. వేప పువ్వు, మామిడికాయలు, బెల్లం, చింతపండు వంటివి తినడం వల్ల సమస్యలు లేకుండా చేస్తుంది. వేపలో ఉండే చేదు గుణం వైరస్ లు రాకుండా చేస్తుంది. బెల్లం పిత్త, వాత సమస్యలు లేకుండా చేస్తుంి. చింతపండు జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. మామిడికాయ శరీరాానికి వెచ్చదనం తీసుకొస్తుంది. ఇలా ఇన్ని లక్షణాలు కలిగిన వాటిని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు.

ఉగాది పచ్చడిని తయారు చేసుకునేందుకు మిరపకాయ, బెల్లం, మామిడికాయలను తురుముకోవాలి. వేప పువ్వను నీళ్లలో కడిగి శుభ్రం చేసుకోవాలి. చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. చింతపండు నీళ్లలో ఉప్పు, మామిడి తురుము, బెల్లం తురుము, పచ్చి మిరపకాయ తురుము, వేపపువ్వు వేసుకోవాలి. వేప పువ్వును అధికంగా వాడరాదు. చేదు పెరిగితే తినడం కష్టం. కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు, జామ ముక్కలు కూడా కలుపుంటే మంచి రుచి వస్తుంది. దీంతో పచ్చడిని ఇష్టంగా తినొచ్చు. మన శరీరానికి పచ్చడి ఎంతో మేలు చేస్తుంది.