https://oktelugu.com/

Weight Loss: ఈ రూల్స్ పాటిస్తే.. నెల రోజుల్లోనే ఈజీగా వెయిట్ లాస్

వర్క్ బిజీ, ఇంట్లో పనుల వల్ల బయట ఫుడ్ తింటున్నారు. తినాల్సిన బయట ఫుడ్ అంతా తినేస్తున్నారు. మళ్లీ బరువు పెరిగిన తర్వాత తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెల రోజుల్లో ఈజీగా బరువు తగ్గాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. అవేంటో మరి తెలియాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 15, 2024 / 06:48 AM IST

    Weight Loss

    Follow us on

    Weight Loss: అందంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉండాలని చాలామంది అమ్మాయిలు భావిస్తారు. కాస్త లావుగా ఉన్నా సరే బరువు ఎక్కువ ఉన్నామని ఫీల్ అయ్యి డైటింగ్ చేస్తుంటారు. బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈజీగా బరువు తగ్గాలని డైట్ ఫాలో కావడం, జిమ్‌కి వెళ్లడం, వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తారు. ఎన్ని నియమాలు చేసిన బరువు తగ్గరు. ఎందుకంటే ఈరోజుల్లో చాలా మంది ఫాస్ట్‌ఫుడ్స్ తినడం, పోషకాలు లేని పదార్థాలు తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతున్నారు. బయట ఎక్కడ ఏం దొరికితే అదే తినడం వల్ల అనారోగ్యమైన కొవ్వులను శరీరంలో పెంచుకుంటున్నారు. దీనివల్ల ఊబకాయం, థైరాయిడ్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వర్క్ బిజీ, ఇంట్లో పనుల వల్ల బయట ఫుడ్ తింటున్నారు. తినాల్సిన బయట ఫుడ్ అంతా తినేస్తున్నారు. మళ్లీ బరువు పెరిగిన తర్వాత తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెల రోజుల్లో ఈజీగా బరువు తగ్గాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. అవేంటో మరి తెలియాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి.

    ఇంట్లోనే సరైన నియమాలు పాటిస్తే అసలు జిమ్‌కి వెళ్లకుండా ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గడానికి ఫస్ట్ ఫుడ్ విషయంలో రూల్ పాటించాలి. రోజూ శరీరానికి అవసరమైన వరకు మాత్రమే ఫుడ్ తీసుకోవాలి. అంటే రోజుకి 500 క్యాలరీల కంటే తక్కువగా ఉండే ఫుడ్ మాత్రమే తినాలి. దీనివల్ల తొందరగా బరువు తగ్గుతారు. ప్రొటీన్లు, విటమిన్లు ఉండటంతో పాటు ఆరోగ్యానికి బలాన్నిచ్చే వాటిని తీసుకోవాలి. అలాగే వ్యాయామం తగ్గాలంటే తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ ఒక 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అలాగే ఒక 20 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. వాకింగ్ చేస్తూ ఆ తర్వాత రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మీరు తొందరగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.

    ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉంటే ఈజీగా బరువు తగ్గుతారు. బాగా ఒత్తిడికి గురవుతుంటే మాత్రం యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. అలాగే సరైన సమయానికి నిద్రపోవాలి. తక్కువగా నిద్రపోతే ఒత్తిడికి గురై బరువు పెరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. మద్యం, ధూమపానం వంటివి సేవించకూడదు. అలాగే ప్రాసెస్డ్ చేసిన ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి అసలు తీసుకోకూడదు. అలాగే మీరు తినే ఆహారంలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యమైన కొవ్వులు ఉండేలా చూసుకోండి. దీనివల్ల ఆరోగ్యంగా ఒక నెల రోజుల్లో ఈజీగా బరువు తగ్గుతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.