Watch this video: జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎన్నో ముళ్ళబాటలపై వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వీటిని దాటుకుంటూ వెళ్లిన కొందరు విజయం సాధిస్తారు. మరికొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా సక్సెస్ను అందుకోలేరు. అందుకు కారణం వారు ప్రయత్నించే విధానమే లోపం అని కొందరు మేధావులు అంటూ ఉంటారు. ఒక పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు అంతా ఒకే చోట చదువుకుంటూ ఉంటారు. కానీ చివరికి వారిలో కొంతమంది మాత్రమే జీవితంలో సక్సెస్ ను అందుకుంటారు. అందుకు కారణం ఏంటంటే వారి మనసులో ఉండే ఆలోచనలో భిన్నత్వమే అని అంటారు. అది ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. మరి ఆ స్టోరీ ఏంటంటే?
ఒక వ్యక్తి చెట్టు మీద ఉన్న మామిడి పండును తెంపుకోవాలని అనుకుంటాడు. దీంతో ఒక పెద్ద కర్రలు తీసుకువచ్చి దానిని కొడుతూ ఉంటాడు. అది ఎంతసేపు కర్రతో కొట్టిన కూడా మామిడికాయలు కిందికి రాలవు. దీంతో విసిగిపోయి మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తాడు. అయితే ఇంతలో ఇక్కడికి మరో వ్యక్తి చిన్న కర్రలు తీసుకొని వస్తాడు. అతడు ఏమాత్రం కష్టపడకుండా సింపుల్గా కర్రను విసురుతాడు. దీంతో ఒకేసారి నాలుగు ఐదు మామిడికాయలు కిందికి రాలుతాయి. హ్యాపీగా ఆ మామిడికాయలను తీసుకొని ఆ వ్యక్తి వెళ్తాడు. కానీ అప్పటికే ఎంతో ప్రయత్నించి విఫలమైన వ్యక్తి నిరాశ చెందుతాడు.
ఇది కొందరు కలిసి సృష్టించిన వీడియో. అయినా కూడా ఇందులో ఎంతో నీతి ఉందని కొందరు కామెంట్ల ద్వారా తెలుపుతున్నారు. ఎందుకంటే జీవితంలో సక్సెస్ కావాలని చాలామందికి ఉంటుంది. కానీ అందుకు చేసే ప్రయత్నం అందరిది సరైంది కాదు. మిగతా ప్రాణాల కంటే మనుషులకు మెదడు ఉంటుంది. దీనిని సాన పెట్టి బాగా ఆలోచించి సరైన దారి ఏంటో తెలుసుకోవాలి. ఈ వీడియోలో పండును పొందడానికి ఆ వ్యక్తి పెద్ద కార్లు కాకుండా.. తెలివిగా దానిని ఎలా తీసుకోవాలని ఆలోచించాలి. అలా ఆలోచిస్తే శ్రమ తగ్గడంతో కావాల్సిన పండ్లను పొందే అవకాశం ఉంటుంది.
అలాగే జీవితంలో కూడా ప్రతి వ్యక్తి తాను అనుకున్న గోల్ ను చేరడానికి అందరిలాగా శారీరకాశ్రమను ఉపయోగించడం కాదు.. మెదడుకు పదును పెట్టి ఏది సరైన మార్గం? కష్టం లేకుండా తెలివితో ఎలా చివరి వరకు చేరాలి? అనే విషయాలపై దృష్టి పెట్టాలి. ఇలా ప్రతి సమస్యను తెలివిగా పరిష్కరించుకుంటే ఎలాంటి కష్టం లేకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. వీటిని దాటడానికి కూడా ఆలోచించి పరిష్కారం వెతుక్కోవాలి. కానీ కొందరు ఒక సమస్య రాగానే కుంగిపోతు ఉంటారు. ఏ మాత్రం ఆలోచించకుండా బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడే సమయాన్ని ఆలోచించడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు.