Washing Machine Tips: మహిళలకు ఎంతో కష్టమైన పనులలో బట్టలు ఉతకటం ఒకటనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలలో చాలామంది వాషింగ్ మెషీన్ ల సహాయంతో బట్టలు ఉతుకుతున్నారు. అయితే అన్ని రకాల బట్టలను మెషీన్ లో వేయడం వల్ల కొన్ని సందర్భాల్లో దుస్తుల రూపురేఖలు మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఏ దుస్తులు ఏ విధంగా ఉతికితే మన్నికగా ఉంటాయో తెలుసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.
బట్టలను ఉతకడానికి సాధారణంగా డిటర్జెంట్ ను వినియోగిస్తామనే సంగతి తెలిసిందే. అయితే డిటర్జెంట్ తో పాటు ఫ్యాబ్రిక్ సాఫ్టెనర్ ను వాడటం ద్వారా బట్టల మన్నిక బాగుంటుందని చెప్పవచ్చు. వాషింగ్ మెషీన్ లోని డ్రైయర్ ను వినియోగించడం కంటే బట్టలను బయట ఆరేయడమే మంచిది. ఇలా చేయడం ద్వారా బట్టల మన్నిక బాగుండటంతో పాటు ఎక్కువ సంవత్సరాలు వినియోగించవచ్చు.
Also Read: Tenant Rights: అద్దెకు ఉండే వ్యక్తికి ఇంటిపై హక్కు ఉంటుందా.. చట్టం ఏం చెబుతోందంటే?
తెలుపు బట్టలను, లేత రంగు బట్టలను, ముదురు రంగు బట్టలను విడిగా వేస్తే మంచిది. కాటన్ దుస్తులను రంగు పోతుంటే మొదట చల్లని నీటిలో వేయాలి. ఆ తర్వాత నీడలో ఆరేసి ఐరన్ చేయవచ్చు. బట్టలను ఉతికే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అవి త్వరగా పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదని చెప్పవచ్చు.
Also Read: Om Chant Benefits: ప్రతిరోజూ “ఓం” జపం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?