Rental Home : అద్దె ఇంటికి మారాలి అనుకుంటున్నారా? ఈ విషయాలు ముందుగానే తెలుసుకోండి

కరెంట్ బిల్.. ఇల్లు అద్దెకు తీసుకుంటే కరెంట్ బిల్ పెద్ద సమస్య. మీటర్ మీకు సపరేట్ గా ఉంటే ఎలాంటి టెన్షన్ లేదు. కానీ కలిసి ఉంటేనే చాలా ఇబ్బంది. ఓనర్ తో లేదా ఇతర రెంటర్స్ తో కలిపి మీటర్ ఉంటే.. బిల్ ఏ విధంగా తీసుకుంటారు అనే అంశాల గురించి తెలుసుకోవాల్సిందే.

Written By: NARESH, Updated On : April 1, 2024 11:05 pm

Want to move into a rental home

Follow us on

Rental Home : సొంత ఇల్లు లేకపోతే కచ్చితంగా రెంట్ కు ఇవ్వాల్సిందే. పిల్లల చదువుల కోసం, ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయితే ఇలా రీజన్స్ ఎన్ని ఉన్నా రూమ్ మాత్రం మారాల్సి వస్తుంటుంది. అయితే ఇల్లు మారుతున్నప్పుడు కొన్ని విషయాలను మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. కొత్త ఇంటికి మారుతుంటే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోండి. అవేంటో అంటే..

చట్టపరమైన ఒప్పందం ఎలా ఉందో చెక్ చేసుకోవడం ముఖ్యం. ఇప్పుడు కొందరు చట్టపరమైన ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. అలాంటప్పుడు అందులో ఏం రాసి ఉంది అని క్షుణ్ణంగా చదవాలి. పత్రాలు లేకపోతే ముందుగానే క్లారిటీగా మాట్లాడుకోవాలి. ఎలాంటి నియమాలు పాటించాలి అనే వివరాలను కచ్చితంగా ఓనర్ తో ముందుగానే మాట్లాడాలి.

కరెంట్ బిల్.. ఇల్లు అద్దెకు తీసుకుంటే కరెంట్ బిల్ పెద్ద సమస్య. మీటర్ మీకు సపరేట్ గా ఉంటే ఎలాంటి టెన్షన్ లేదు. కానీ కలిసి ఉంటేనే చాలా ఇబ్బంది. ఓనర్ తో లేదా ఇతర రెంటర్స్ తో కలిపి మీటర్ ఉంటే.. బిల్ ఏ విధంగా తీసుకుంటారు అనే అంశాల గురించి తెలుసుకోవాల్సిందే.

నిర్వహణ చార్జీలు.. నిర్వహణ ఛార్జీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. మెయింటెనెన్స్ ఖర్చులు ఏ విధంగా ఛార్జ్ చేస్తారో ముందుగానే తెలుసుకోండి. ఇప్పుడు ప్రతి ఇంటికి ఈ ఖర్చులు ఉంటున్నాయి. సో వీటి గురించి అడగాల్సిందే. మధ్య మధ్యలో అడుగుతున్న ప్రతిసారి ఇవ్వలేరు కాబట్టి. దేనికి ఎంత ఛార్జ్. మొత్తంగా ఎంత అవుతుంది వంటి వివరాలు తెలుసుకోవడం బెటర్.