https://oktelugu.com/

AC precautions : ఏసీ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

సీజన్ ముందు సర్వీస్.. కొత్త సీజన్ లో ఏసీని ఆన్ చేస్తే అంతకు ముందే సర్వీస్ మస్ట్. దీని వల్ల ఏసీ లోపల ఉన్న మురికి తొలగిపోతుంది. అందుకే సర్వీస్ కచ్చితంగా చేయించాలి. ఏసీకి ధూళి ఉంటే మీరు ముందుగానే క్లీన్ చేస్తూ ఉంటే సర్వీస్ అవసరం లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : April 1, 2024 / 11:00 PM IST

    AC precautions

    Follow us on

    AC precautions : వామ్మో ఎండాకాలం వచ్చేసింది. ఎండల వేడికి తట్టుకోవడం కష్టమే. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫ్యాన్లు, కూలర్ల గాలికి ఇంట్లో ఉండలేకపోతున్నారు జనాలు. మరి మరో మార్గం ఏంటి? ఊర్లో చెట్టు కింద కూర్చుంటారు. కానీ ఈ కాంక్రీట్ బిల్డింగ్ లు ఉన్న పట్టణంలో మాత్రం చెట్లు ఎక్కడివి. అందుకే జై ఏసీ అంటున్నారు జనాలు. కానీ కరెంట్ బిల్ మాత్రం మండిపోతుంది. అయినా సరే గాలి ముఖ్యం అనుకుంటే ఏసీ విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి. అవేంటంటే..

    శుభ్రం చేసుకోవడం.. కొంతమంది తమ ఇళ్లల్లో ఏసీని పెట్టుకుంటారు. కానీ సరిగ్గా శుభ్రం చేయరు. ఏసీ పెట్టుకోవడం కాదు దాన్ని తరచూ శుభ్రం చేయడం కూడా మస్ట్. ఏసీని రన్ అవుతున్నప్పుడు అందులో ధూళి కూడా పేరుకుంటుంది. వేసవి కాలం అయిపోయిన తర్వాత బాగా కవర్ చేయాలి. లేదంటే తొందరగా పాడైపోతుంది.

    సీజన్ ముందు సర్వీస్.. కొత్త సీజన్ లో ఏసీని ఆన్ చేస్తే అంతకు ముందే సర్వీస్ మస్ట్. దీని వల్ల ఏసీ లోపల ఉన్న మురికి తొలగిపోతుంది. అందుకే సర్వీస్ కచ్చితంగా చేయించాలి. ఏసీకి ధూళి ఉంటే మీరు ముందుగానే క్లీన్ చేస్తూ ఉంటే సర్వీస్ అవసరం లేదు.

    విండో ఏసీ జాగ్రత్త..ఇంట్లో వెంటిలేషన్ బాగా ఉన్న ప్లేస్ లోనే ఈ విండో ఏసీని అమర్చుకోవాలి. దీనికి వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే.. వేడిగాలి బయటకు పోయే అవకాశం ఉండదు. దీని వల్ల ఏసీ దెబ్బతింటుంది. ఎక్కడైనా ఓపెన్ మురికి కాలువలు మీకు దగ్గర ఉంటే ఈ విండో ఏసీలను అమర్చకపోవడే బెటర్. ఒకవేళ అమర్చితే.. వాటి నుంచి వెలువడే గ్యాస్ ఏసీకి చాలా హానికరం అని గుర్తుపెట్టుకోండి.