Weight Loss: ఇప్పుడున్న కాలంలో చాలామందికి బరువు తగ్గాలని కోరిక బలంగా ఉంది. రకరకాల ఆహారాలు తినడం వల్ల స్థాయికి మించి బరువు పెరిగి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వీరు బరువు తగ్గేందుకు అనేక వ్యాయామాలు చేస్తున్నారు. అయితే వ్యాయామాల వరకు ఓకే.. కానీ వ్యాయామం చేస్తూ ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వ్యాయామం చేసేవారు సరైన ఆహారం తీసుకోవడం వల్లనే కావాల్సిన బరువును తగ్గుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాయామం పూర్తయిన తర్వాత కొన్ని రకాల ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మరి వ్యాయామం పూర్తయిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి? అనేది తెలుసుకుందాం..
వ్యాయామం పూర్తయిన వెంటనే కొందరు భోజనం చేయడానికి రెడీ అవుతారు. ఎందుకంటే కొందరు శారీరక వర్కౌట్ చేయడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది. దీంతో కడుపునిండా తినాలని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యాయామం పూర్తయిన వెంటనే తక్కువ కేలరీలు.. ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలో వేయించిన ఆహారాలు కాకుండా.. సలాడ్ వంటివి తీసుకునే ప్రయత్నం చేయాలి.
వ్యాయామం చేసిన తర్వాత కొందరు డ్రింక్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే డ్రింక్స్ తీసుకుందామనే ఉద్దేశంలో కూల్ డ్రింక్స్ ను తాగుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే చక్కరతో మరోసారి బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగడం బెటర్. ఫ్రూట్ జ్యూస్ అంటే ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా మంచిది.
కొందరు శారీరక వర్కౌట్ ఎక్కువగా చేసిన తర్వాత ఇంట్లో ఉండే స్వీట్స్ ను తింటూ ఉంటారు. కానీ ఇలా తినడం వల్ల చక్కెర శరీరానికి ఎక్కువగా అందించి బరువు త్వరగా తగ్గే అవకాశం ఉండదు. ఇలాంటి సమయంలో స్వీట్స్ కు బదులు ఉడకపెట్టిన గుడ్లు తీసుకోవాలి. అలాగని ఆమ్లెట్ తీసుకోవడం చేయవద్దు. ఉదయం పూట ప్రాసెస్ ఫుడ్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
వ్యాయామం చేసిన తర్వాత శరీరంలోని నీరు దాదాపు బయటకు వెళ్తుంది. దీంతో వెంటనే దాహం వేస్తుంది. అయితే ఈ క్రమంలో చల్లటి నీరు తాగాలని అనుకుంటారు. కానీ అలా చల్లటి నీరు కాకుండా సాధారణ నీరు మాత్రమే తీసుకోవాలి. అయితే సాధారణ నీరు అయినా తక్కువ మోతాదులో తీసుకోవడమే మంచిది. అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపులో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
వ్యాయామం చేసి వచ్చిన తర్వాత శరీరం అలసటగా మారుతుంది. దీంతో కాసేపు నిద్రపోవాలని చూస్తారు. అయితే ఏదైనా ఆహారం తీసుకొని నిద్రపోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల శారీరక శ్రమ చేసిన కనీసం గంట లేదా రెండు గంటల వరకు ఎలాంటి కునుకు తీయకుండా ఉండాలి.