మనలో చాలామంది ఓటర్ కార్డును వినియోగిస్తూ ఉంటారు. ఓటర్ కార్డు గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు వేర్వేరు కారణాల వల్ల ఓటర్ కార్డులో అడ్రస్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవాళ్లు స్మార్ట్ ఫోన్ సహాయంతో సులభంగా ఓటర్ కార్డులోని అడ్రస్ ను మార్చుకోవచ్చు. https://www.nvsp.in/ వెబ్ సైట్ ద్వారా ఓటర్ కార్డులో అడ్రస్ ను మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది.
యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ను ఉపయోగించి లాగిన్ కావడం ద్వారా ఓటర్ కార్డ్ లో అడ్రస్ ను మార్చుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. యూజర్ నేమ్, పాస్ వర్డ్ లేని వాళ్లు కొత్తగా రిజిష్టర్ చేసుకోవడం ద్వారా అడ్రస్ ను మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. లాగిన్ అయిన తర్వాత కరెక్షన్ ఇన్ పర్సనల్ డీటైల్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా వివరాలను మార్చుకునే ఛాన్స్ ఉంటుంది.
ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వివరాలను ఎంచుకుని వివరాలను సరిదిద్దుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఓటర్ కార్డులో పేరు, అడ్రస్, ఫోటో వివరాలను కూడా ఈ విధంగా సులభంగా మార్చుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వివరాలను మార్చుకున్న తర్వాత ప్రూఫ్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత ఒక రెఫరెన్స్ నంబర్ ను పొందే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా సులభంగా ఓటర్ కార్డులో అడ్రస్ ను మార్చుకునే అవకాశం ఉంది. ఓటర్ కార్డు యూజర్లకు ఈ విధంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. ఓటర్ కార్డ్ లో వివరాల మార్పుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే https://www.nvsp.in/ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.