https://oktelugu.com/

Dubai: దక్షిణాది సినిమా ప్రమోషన్లకు అడ్డాగా దుబాయ్​!

Dubai: ఒక కథ సిద్ధమైన తర్వాత చిత్రీకరణ మొదలు ప్రమోషన్స్​తో పాటు విడుదలయ్యే వరకు డైరెక్టర్స్​, హీరోలకు అసలు నిద్ర పట్టదు. ఆ తర్వాత కూడా ఎంతమేర విజయం సాధిస్తుందో అన్న భయాలు ఉంటాయి. అయితే, ఏ సినిమా విజయంలోనైనా కీలక పాత్ర పోషించేది ప్రమోషన్స్​. ప్రస్తుతం సౌత్​స్టార్స్​ ఈ పల్స్ పట్టేసినట్లు కనిపిస్తంది. ఇందుకు వేదికగా దుబాయ్​ను ఎంచుకుంటున్నారు. బాహుబలి, కేజీఎఫ్​, వంటి సినిమాలతో టాలీవుడ్​తో పాటు దక్షిణాది సినిమాల రేంజ్ వేరే లెవెల్​కు పెరిగిపోయింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 11, 2021 / 03:35 PM IST
    Follow us on

    Dubai: ఒక కథ సిద్ధమైన తర్వాత చిత్రీకరణ మొదలు ప్రమోషన్స్​తో పాటు విడుదలయ్యే వరకు డైరెక్టర్స్​, హీరోలకు అసలు నిద్ర పట్టదు. ఆ తర్వాత కూడా ఎంతమేర విజయం సాధిస్తుందో అన్న భయాలు ఉంటాయి. అయితే, ఏ సినిమా విజయంలోనైనా కీలక పాత్ర పోషించేది ప్రమోషన్స్​. ప్రస్తుతం సౌత్​స్టార్స్​ ఈ పల్స్ పట్టేసినట్లు కనిపిస్తంది. ఇందుకు వేదికగా దుబాయ్​ను ఎంచుకుంటున్నారు.

    బాహుబలి, కేజీఎఫ్​, వంటి సినిమాలతో టాలీవుడ్​తో పాటు దక్షిణాది సినిమాల రేంజ్ వేరే లెవెల్​కు పెరిగిపోయింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల అభిరుచులకు తగ్గట్లుగా మంచి కంటెంట్​ ఉన్న సినిమాలతో దర్శక నిర్మాతలు ముందుకొస్తున్నారు. నిర్మాతలు కూడా బడ్జెట్​ విషయంలో అసలు తగ్గట్లేదు. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రమోషన్స్​ను అదే రేంజ్​లోచేస్తున్నారు. ఇందుకోసం దుబాయ్​ను కేంద్రంగా ఎంచుకుంటున్నారు సౌత్​ స్టార్లు. గతంలో హిందీ సినిమాలు మాత్రమే ప్రమోషన్ల కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకునేవి. కాగా, ఇప్పుడు దక్షిణాది సినిమాలూ అదే ఫాలో అవుతున్నాయి. సౌత్ నుంచి ముందుగా ‘రోబో’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం దుబాయ్‌లో జరిగింది.

    ప్రస్తుతం పాన్​ ఇండియా లెవెల్​లో తెరకెక్కుతోన్న సినిమాలన్నీ దుబాయ్​ల ప్రమోషన్​ కార్యక్రమాలు జరిపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. తాజాగా, దుల్కర్ సల్మాన్ నటించిన కురుప్​, ట్రైలర్​ను బుర్జ్​ దుబాయ్​లో ప్రదర్శించారు. మరోవైపు ఆర్​ఆర్​ఆర్​ సినిమా ప్రమోషన్ల్కు సంబంధించిన కార్యక్రమం కూడా దుబాయ్​లోనే జరగనుంది. ఇక పుష్ప కూడా ఇదే ట్రెండ్​ను ఫాలో కానుంది. ఈ క్రమంలోనే సౌత్​ స్టార్లంతా పాన్​ ఇండియా స్థాయిలో ఎదిగేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది.