AC Buying: ఎండాకాలం వచ్చిందంటే చల్లగాలి కోసం ఎదురు చూడాల్సిందే. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుంది అని కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తారు. డే అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎండల తీవ్రత ఇబ్బంది పెడుతుంది. మరి ఇలాంటి రోజుల్లో గాలి కోసం ఎక్కువ మంది ఏసీలను వాడుతున్నారు. కానీ కరెంట్ బిల్లు మోత మోగుతుంటుంది. అయితే ప్రతి రోజు ఎంత ఏసీ వాడుతారు? దానికి ఎంత కరెంట్ బిల్ వస్తుంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎనిమిది గంటలు ఏసీ వాడితే ఎంత కరెంట్ బిల్ వస్తుందో ఓ సారి తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలా మంది 1.00 టన్ కంటే 1.5 టన్ ఏసీలనే కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. అయితే గది పరిమాణాన్ని బట్టి ఏసీని కొనుగోలు చేయాలి. గది పరిమాణం చిన్నగా ఉంటే 1 టన్, కాస్త పెద్దగా ఉంటే 1.5 టన్, మరింత పెద్దగా ఉంటే 2 టన్ ల ఏసీని కొనుగోలు చేయాలి. ఏసీని వాడటం వల్ల ఎండ నుంచి ఉపశమనం లభించడమే కాదు శరీరానికి హాయిగా అనిపిస్తుంటుంది. కానీ కరెంట్ బిల్ మాత్రం అదరహో అనిపిస్తుంటుంది. అందుకే ఏసీ కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు చాలా మంది.
ఇక కొందరి వద్ద ఏసీ ఉంటుంది కానీ రాత్రి మాత్రం వాడరు. ఏసీ ఒక గంట నడిచినా సరే మీటర్ గిర్రున తిరుగుతుంది. ఇంకేంటి బిల్ ఫుల్ గా వస్తుంది. అయితే ఈరోజు ఒక చిన్న లెక్క వేసుకుందాం. దీని వల్ల కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. ఎనిమిది గంటల పాటు 1.5 టన్నుల ఎల్జీ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీని వాడితే మొదటి గంటలో 700 వాట్స్ కరెంట్ ను ఉపయోగిస్తుంది. అంటే ఆ తర్వాత 4 గంటల పాటు 500 వాట్లు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత 3 గంటలకు 200 వాట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది.
బయట ఉష్ణోగ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది ఈ సగటు లెక్క. 1.5 టన్ను ఎల్జీ ఇన్వర్టర్ ఏసీ 8 గంటలు ఉపయోగిస్తే అది మొత్తంగా 3-4 యూనిట్ల కరెంట్ వాడే అవకాశం ఉంటుంది. కొందరు 2 గంటలు ఉపయోగించి ఆఫ్ చేస్తే కొందరు 8గంటల పాటు మరీ వాడుతుంటారు. సో మీరు ఎన్ని గంటలు వాడుతున్నారు అనేదాన్ని బట్టీ ఈ సగలు లెక్క వేసుకోండి.
కొత్త 1.5 టన్నుల ఏసీని 8గంటల పాటు రన్ చేస్తే రోజు 4-5 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. ఈ లెక్కన నెలపాటు ఏసీకే 120-150 యూనిట్ల వరకు ఖర్చు అవుతుంది. మరి 8 గంటలు వాడితే మీకు కరెంట్ బిల్ ఏ రేంజ్ లో వస్తుందో మీరే ఊహించుకోండి. అందుకే మీరు ఏసీ కొనేముందు ఏ ఏసీ తీసుకోవాలి? ఎంత సేపు వాడాలి అనే వివరాలు షాప్ వాళ్లను అడిగి కొనుగోలు చేయడం ఉత్తమం.