Walking After Meal: రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తున్నారా? కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

భోజనం తర్వాత నడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా, రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 20 నిమిషాల తర్వాత కాసేపు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మరి ఎంత సేపు నడవాలి అంటే..ఓ 20 నుంచి 40 నిమిషాలు నడవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చట.

Written By: Swathi, Updated On : August 19, 2024 9:24 am

Walking After Meal(1)

Follow us on

Walking After Meal: బిజీ బిజీ బిజీ ఎప్పుడు చూసిన ప్రజలు బిజీ అంటూ లైఫ్ ను కష్టతరం చేసుకుంటున్నారు. కానీ ఒకసారి కూడా తమ ఆరోగ్యాల గురించి ఆలోచించుకోవడం లేదు. బిజీ లైఫ్, పని ఒత్తిడి.. వంటి వాటితో ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. చాలామందికి డే టైమ్ లో అస్సలు ఖాళీ దొరకదు.. అలాంటప్పుడు రాత్రి పూట భోజనం చేసిన తర్వాత .. కాసేపు నడిస్తే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్యులు. సాధారణంగా పనిచేసి వచ్చి అలసిపోవడం కామన్. ఈ క్రమంలో రాత్రి భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ.. రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందట. రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉన్నాయి. మరి రాత్రి భోజనం తర్వాత ఎంత సేపు నడవాలి. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం తర్వాత నడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా, రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 20 నిమిషాల తర్వాత కాసేపు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మరి ఎంత సేపు నడవాలి అంటే..ఓ 20 నుంచి 40 నిమిషాలు నడవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చట.

రాత్రి పూట నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాత్రిపూట నడవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సరిగ్గా పని చేస్తుంది. తద్వారా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందేలా చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది ఈ నడక. రాత్రిపూట నడవడం వల్ల కేలరీలు కూడా కరిగిపోతాయి..దీంతో మీరు బరువు తగ్గవచ్చు. రాత్రిపూట నడవడం వల్ల శరీరం అలసిపోవడం పక్కా జరుగుతుంది. ఇక అలిసి పోయిన తర్వాత మంచి నిద్ర కూడా వస్తుంది.

రాత్రిపూట నడవడం వల్ల ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రెగ్యులర్ వాకింగ్ గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రాత్రిపూట నడవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. తద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది.

అయితే రాత్రి పూట ఎలా నడవాలో కూడా తెలుసుకుందాం. రాత్రి భోజనం తేలికగా, పోషకమైనదిగా ఉండాలి. భారీగా తినడం.. ఫ్రైలతో తినడం వంటివి కాస్త తగ్గించడం బెటర్. మరీ ముఖ్యంగా వేగంగా నడవడం మంచిది కాదు. కాస్త నెమ్మదిగా నడవాలి. సౌకర్యవంతమైన దుస్తులు ధరించి నడవడం వల్ల నడకలో ఇబ్బంది జరగదు. పడుకోవడంలో ఇబ్బంది ఉండదు. మంచి ప్రదేశంలో నడవడం మరీ మంచిది. లేదంటే లేనిపోని సమస్యలు వస్తుంటాయి. ట్రాఫిక్ ఉండే ప్లేస్ ను నివారించండి.