Virat Kohli CutOut: అతడి పని అయిపోయింది అన్నారు.. ఇక ఆటకు పనికిరాడు అన్నారు. విశ్రాంతి తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. కొందరు కూతురిపై అత్యాచారం చేస్తామని బెదిరించారు. కానీ అతడు మౌనంగానే ఉన్నాడు. తనదైన రోజు వస్తుందని అన్ని భరించాడు. ఆ రోజు రానే వచ్చింది. తన బ్యాటు శివతాండవం చేస్తోంది. మాటలతో చెబితే కిక్ ఏముంటుందని.. తన బ్యాట్ తోనే సరైన సమాధానం చెబుతున్నాడు. తనపై విమర్శలు చేసిన వారి నోళ్ళతోనే మెచ్చుకొనేలా చేస్తున్నాడు. ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో అదరగొడుతున్న కోహ్లీకి తెలుగోళ్లు తమ ప్రేమను మరింత చూపుతున్నారు.

స్టార్ హీరోలను కాదని
మనదేశంలో స్టార్ హీరోలకి ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వారి సినిమా విడుదలవుతుందంటే అభిమానులు భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా అటువంటి అభిమానాన్నే చురగొంటున్నాడు. ఇప్పుడు అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నాడు. సచిన్, ధోని తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న క్రికెటర్ కోహ్లీ. 2008లో టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు… మొదట్లో కొంత తడబడ్డాడు. ఇక ఒకసారి సెట్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అతడికి రాలేదు.. ఆ దేశంలో బడికెళ్లే పిల్లాడి నుంచి కుర్రాళ్ళ వరకు అందరూ కోహ్లీ ఫ్యాన్సే. వేరే దేశాల క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, మహిళా క్రికెటర్లు.. ఒక్కరేమిటి ఎవరిని అడిగినా కోహ్లీ వాళ్ళ మనసులో ఉంటాడు. అలాంటి కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లేమి తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో జూలు విధించిన సింహం లాగా ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై సెంచరీతో చెలరేగాడు. అది మొదలు టి20 మెన్స్ వరల్డ్ కప్ లో చెలరేగి ఆడుతున్నాడు.

ఈ నేపథ్యంలో కోహ్లీ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో సుదర్శన్ థియేటర్లో అతని అభిమానులు 50 ఫీట్ల కోహ్లీ కటౌట్ ఏర్పాటు చేశారు. దానికి ఇక్కడ తెలుగు హీరోల కటౌట్స్ మాత్రమే పెడుతుంటారు.. కానీ ఇప్పుడు అదే ప్లేస్ లో కోహ్లీ నిలిచి తొలి క్రికెటర్ గా ఈ ఘనత సాధించాడు.. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోనూ 40 అడుగుల కోహ్లీ కటౌట్ ఏర్పాటు చేశారు. ముంబైలోని ఒక పెద్ద గోడపై కోహ్లీ ముఖచిత్రాన్ని గీశారు.. ఈరోజు అతడి పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి.. సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ కటౌట్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న కోహ్లీ అభిమానులు తమ వాట్సాప్ డీపీ లకు అతని ఫోటో యాడ్ చేశారు. స్టేటస్ లో టి20 మెన్స్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ను పెట్టుకున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇవ్వాలా కోహ్లీ జన్మదిన సంబరాలు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. తోట్ల అతడి అభిమానులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..