https://oktelugu.com/

Vastu Tips : వాస్తు టిప్స్ ఇంటి ముందర చెట్లు ఎత్తుగా పెరిగితే ఏమవుతుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇల్లును వాస్తుు ప్రకారంగా నిర్మించుకోవాలి. అలాగే ఇంటి పరిసరాలు, ఇంట్లోని వస్తువులు సైతం సరైన దిశలో అమర్చుకోవాలి. లేకుంటే ఇంట్లో నిత్యం అశాంతి నెలకొని ఉంటుంది. కొందరి ఇళ్లల్లో ధనం ఎక్కువగా ఉన్నా.. వారి ఇంట్లో ఎప్పుడూ అశాంతి నెలకొని ఉంటుంది

Written By:
  • Srinivas
  • , Updated On : October 21, 2024 5:14 pm
    Vastu-tips

    Vastu-tips

    Follow us on

    Vastu Tips: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇల్లును వాస్తు ప్రకారంగా నిర్మించుకోవాలి. అలాగే ఇంటి పరిసరాలు, ఇంట్లోని వస్తువులు సైతం సరైన దిశలో అమర్చుకోవాలి. లేకుంటే ఇంట్లో నిత్యం అశాంతి నెలకొని ఉంటుంది. కొందరి ఇళ్లల్లో ధనం ఎక్కువగా ఉన్నా.. వారి ఇంట్లో ఎప్పుడూ అశాంతి నెలకొని ఉంటుంది. అందుకు కారణం ఆ ఇంట్లో కొన్ని వస్తువులు వాస్తుప్రకారం లేకపోవడమే అని కొందరు వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంట్లోని వస్తువులతో పాటు ఇంటిముందర కూడా కొన్ని వస్తువులను, కొన్ని పనులు సక్రమంగా చేయాలని అంటున్నారు. వీటిలో చెట్లు ప్రధానమైనవి ఇంటిముందర చెట్లు ఎత్తుగా ఉంటే అశుభం అని కొందరు అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    చెట్లు మానవ ప్రగతికి మెట్లు అని అంటారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే బయటి ప్రదేశాల్లోనే కాకుండా ఇంట్లోనూ చెట్లు ఉండడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది. ఆ ప్రాంతం అంతా స్వచ్ఛమైన వాతావరణంలో ఉంటుంది. అయితే ఇంట్లో చెట్లు పెంచుకునే ముందు వాస్తు నియమాలు తెలుసుకోవాలి. ఇంటి ముందర నిమ్మచెట్లు పెంచుకోరాదు. ఈ చెట్లు ఎక్కువగా ముళ్లను కలిగి ఉంటాయి. ఇలాంటి చెట్లు ఇంటి ముందు ఉండడం వల్ల ఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చిన్న పిల్లలు ఉంటే వారు ప్రమాదంలో పడుతారు.

    అలాగే ఇంటి ముందర పెంచే చెట్లు ఎత్తుగా పెరగకూడదని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఎందుకంటే ఇంటి కంటే చెట్టు ఎత్తుగా ఉండడం వల్ల ఇంట్లో అశుభం జరగుతుంది. అంతేకాకుండా ఇంటికంటే ఎత్తుగా పెరిగే చెట్లతో అవి గాలి, తుఫాను సమయంలో విరిగితే పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఒకప్పుడు నాటిన చెట్లు ఇప్పుడు ఎత్తుగా పెరిగాయి. కానీ ఇళ్లు మాత్రం తక్కువ ఎత్తులో ఉన్నాయి. ఇలాంటి వారు జ్యోతిష్యులను సంప్రదించి అందుకు పరిహారంగా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.

    ఇవ ఇవే కాకుండా ఇంట్లోను ఆగ్నేయం వైపు బావి ఉండకూదని అంటున్నారు. దాదాపు ఈశాన్యం వైపు మాత్రమే నీరు ఉండేలా చూసుకోవాలి. ఈశాన్యం వైపు దేవతలు ఉంటారని అంటారు. ఇటు వైపు ఉన్న నీరు వాడడం వల్ల ఆరోగ్యం అని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇంటికి ఎదురెదెరుగా డోర్లు ఉండడం శుభప్రదం కాదు. ఇలా ఉండడం వల్ల ఇంట్లో ఎప్పుడు అశాంతి నెలకొంటుంది. ఇంట్లో ఈ శాన్యం వైపు బరువులు అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి.

    ఇల్లు నిర్మించుకునే సమయంలో ఉత్తరం లేదా తూర్పు వైపు ఎక్కువగా స్థలం ఉండేలా చూడాలి. ఉత్తరం కంటే దక్షిణం వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే ఆ ఇంటి పెద్ద నిత్యం అనారోగ్యంతో ఉంటారు. నైరుతి వైపున తలుపు లేకుండా చూడాలి ఎందుకంటే ఇటునుంచి ప్రమాద సంకేతాలు వెలువడుతాయి. ఇంటి ప్రధాన గేటు నైరుతి దిశలో ఉంచకూడదు. ఇలా ఏర్పాటు చేయడం వల్ల వంటగదిలో నిత్యం సమస్యలు ఉంటాయి.