Vastu Dosha Financial Problems: ఈ రోజుల్లో మనం ఎంత సంపాదించినా డబ్బు ఇంట్లో నిలవడం లేదు. దీంతో తాము ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. వాస్తు దోషాలు ఉంటే పలు రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డబ్బు ఇంట్లో నిలవకుండా పోతుందంటే దానికి కారణం వాస్తు దోషాలే అని తేల్చుతుంటారు. కానీ తప్పు ఎక్కడ జరిగిందనే విషయమే మనం కనిపెట్టాలి. అందుకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. లేకపోతే మన ఇల్లు ఆర్థిక ఇబ్బందులకు నెలవుగా మారడం ఖాయం.
ఇంట్లో నీళ్ల ట్యాంకులు, కుళాయిల నుంచి నీరు లీక్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడ నుంచైనా నీరు కారుతుంటే మనకు ఇంట్లో డబ్బు నిలవదు. ఇది చూడటానికి పెద్ద విషయం కాకపోయినా మన ఆర్థిక వ్యవహారాలపై పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా నీళ్లకు సంబంధించిన లీకేజీలు లేకుండా చూసుకోవడమే ఉత్తమం.
మన ఇంటికి ఉన్న తలుపుల నుంచి శబ్ధం వస్తే నష్టాలు వస్తాయి. తలుపులు తెరిచినా మూసినా ఎలాంటి చప్పుడు రాకూడదు. ఒకవేళ వస్తే ఇంటికి అరిష్టమే కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. తలుపులకు ఇలాంటి చప్పుడు వస్తే వెంటనే మార్చుకోవాలి. ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే తలుపులు చప్పుడు లేకుండా చూసుకోవడం మంచిది.
ఇంట్లో బాత్ రూం కూడా బాగా ఉండేలా చూసుకోవాలి. బాత్ రూం ఎప్పుడు పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తడిగా ఉంటే మనకు నష్టాలు వస్తాయి. అందుకే నీరు లేకుండా పూర్తిగా ఎండిపోయి ఉంటే మంచిది. ఇంటిపైకప్పుపై ఎలాంటి వస్తువులు ఉంచుకోకూడదు. ఇది కూడా వాస్తుకు ఇబ్బందే. ఇంట్లో స్టవ్ మీద కూడా ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే మనకు ఆర్థిక నష్టాలు రావడం సహజం.