Vastu Tips: డబ్బు సంపాదించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ కొందరు జీవితాంతం కష్టపడినా అనుకున్నంత ధనవంతులు కాలేరు. కానీ కొందరు కొద్ది కాలంలోనే ఐశ్వర్యవంతులు అవుతారు. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నా..ఇంట్లో కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం లేకపోతే డబ్బు నిల్వదు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఇంటి నిర్మాణం చేసేటప్పుడు వాస్తు నియమాలు పాటిస్తాం. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించుకుంటాం. కానీ ఆ తరువాత కొన్ని వస్తువుల వాస్తు ప్రకారంగా ఉన్నప్పుడే ఇంట్లో ధనం ఉంటుంది. లేకపోతే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. కొందరు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్న ప్రకారం నియమాల ప్రకారం వస్తువులు ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని అంటున్నారు. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎలాంటి గొడవలు పడకుండా సంతోషంగా ఉంటారని చెబుతారు. అయితే చాలా మంది వీటిని పట్టించుకోరు. అలాంటి వారు నిత్యం కష్టాలు ఎదుర్కొంటారని చెబుతూ ఉంటారు. ఎలాంటి కష్టం లేకుండా, ఇంట్లో కుటంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటూ, సంతోషంగా ఉండాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించాలని చెబుతారు. అయితే వాస్తు ప్రకారం వస్తువులు ఉంచడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. కొన్ని ముఖ్యమైన వస్తువులు సరైన దిశలో ఉంచడమే. వీటిని వాస్తు ప్రకారం ఆ దిశలో ఉంచడం వల్ల ఇంట్లోకి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని అంటారు. అయితే ఇంట్ల ఎలాంటి వస్తువులు? ఎక్కడ ఉంచాలి? అలా ఉంచితే ఏం జరుగుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
మనిషి జీవనాధారానికి నీరు ఎంతో అవసరం. నీటిని వివిధ అవసరాలకు ఉపయోగించడమే కాకుండా ఇంటి పరిసరాల్లో ఎప్పుడూ పాత్రల్లో, బకెట్లలో నీటిని ఉంచాలని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. హిందూ శాస్త్రం ప్రకారం నీటిని గంగాదేవితో పోలుస్తాం. అందువల్ల ఈ నీరు సరైన దిశలో నిల్వ ఉండడం వల్ల ఇంటికి మంచిది అని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఈ తరుణంలో ఇంటికి తూర్పు వైపు ఖాళీ ప్రదేశంల ఉంటే చిన్న పాటి పౌంటేన్ నిర్మించుకోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పౌంటేన్ లో ఎప్పటికీన నీరు ఉండేలా చూసుకోవాలన్నారు.
ఇంట్లో ఆక్వేరియం ఉంచుకోవడం కొందరి హాబీ. దీనిని కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంచడం వల్ల ఇంట్లోకి వద్దన్నా ధనం వస్తుంది. అయితే దీనిని ఇంట్లో ఉత్తరం వైపున ఉంచాలని చెబుతున్నారు. చేపలు సానుకూల సంకేతానికి ప్రతిగా ఉంటాయని అంటారు. నీటిలో ఉన్న చేపలు ఇంట్లోకి ధనం రావడానికి అవకాశంగా ఉంటాయి. అందువల్ల అక్వేరియం ఉంచుకోవాలనుకునేవారు ఇంట్లో ఉత్తరం వైపున ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు.
నీటితో పాటు మొక్కులు కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. వీటిలో మనీ ప్లాంట్ ను ఈమధ్య చాలా మంది పెంచుతున్నారు. అయితే దీనిని ఇంట్లో దక్షిణం వైపు ఉంచాలంటున్నారు. అలాగే ఈ మొక్క ఎప్పటికీ వాడిపోకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ ఈ మొక్క కాస్త ఎండిపోయినా వెంటనే దాని స్థానంలో కొత్త మొక్క ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
కమలం మొక్కకు హిందువులు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. కొందరు దేవతలకు దీనిని సమర్పిస్తారు. అయితే స్పటికంతో ఉన్న కమమం ఆకారాన్ని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. స్పటిక కమలంను ఇంట్లో కిటికి వద్ద ఉంచాలని వాస్తు శాస్త్ర నిపుణలు చెబుతున్నారు. ఇలా ఉంచడం వల్ల ఇల్లు సంతోషంగా ఉండడమే కాకుండా వద్దన్నా ధనం వస్తుందని వాస్తు శాస్త నిపుణులు చెబుతున్నారు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More