Marriage Vastu: దేశంలో చాలామంది సరైన సమయంలో పెళ్లి కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొంతమందికి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వేర్వేరు కారణాల వల్ల వివాహం ఆగిపోవడం జరుగుతుంది. పెళ్లి విషయంలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల కొంతమంది వృత్తిపై కూడా సరిగ్గా దృష్టి పెట్టలేరు.
అయితే కొన్నిసార్లు వాస్తు కూడా పెళ్లి ఆలస్యం కావడానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. పెళ్లి చేసుకోవాలని భావించే వాళ్లు తెలుగు, పసుపు, పింక్ బెడ్ షీట్ లను ఎంచుకుంటే మంచిది. పెళ్లి కాని అబ్బాయిలు ఈశాన్య దిశలో నిద్రపోతే మంచిది. పెళ్లి కాని అమ్మాయిలు వాయువ్య దిశలో నిద్రపోతే మంచిది. అబ్బాయిలు ఆగ్నేయ దిశలో అమ్మాయిలు నైరుతి దిశలో నిద్రపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు.
ఇంటి మధ్యలో మెట్లు ఉన్నా వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మంచం కింద ఐరన్ తో తయారైన వస్తువులను ఉంచడం మంచిది కాదు. ఇంటిలోని గోడలు ముదురు రంగులో కాకుండా లేత రంగులో ఉంటే మంచిది. ఇంటికి లేత రంగుల గోడలు ఉండటం వల్ల పెళ్లి ఆలస్యమయ్యే అవకాశాలు దాదాపుగా ఉండవని చెప్పవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుని పెళ్లి ప్రయత్నాలు చేస్తే మంచిది.
వాస్తు దోషాలను కొంతమంది తేలికగా తీసుకున్నా ఈ కాలంలో కూడా వీటిని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. బరువైన వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల కూడా పెళ్లి ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.