Vastu Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పాటించాలి. వాస్తు పద్ధతులు కూడా లెక్కలోకి తీసుకోవాలి. వాస్తు ప్రకారం అన్ని సక్రమంగా లేకున్నా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో పక్కా వాస్తు ప్రకారం ఉంటేనే అన్ని సవ్యంగా సాగుతాయి. లేదంటే ఇబ్బందులొస్తాయి. మనం ఆహారం తీసుకునే సందర్భంలో కూడా సరైన దిశలో కూర్చుంటేనే ఫలితం ఉంటుంది. మనం ఎలా కూర్చుని తింటే మంచి లాభాలు ఉంటాయో తెలుసుకుని మరీ జాగ్రత్తలు తీసుకోవాలి.
తూర్పు దిశలో..
తూర్పు దిశలో కూర్చుని తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన లేకుండా పోతాయి. మెదడు ఉత్తేజితం అవుతుంది. తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. ముసలివారికి, రోగులకు ఇలా భోజనం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. అందుకే ఎక్కువగా తూర్పు వైపు కూర్చుని తింటేనే మన ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉత్తరం వైపు..
ఉత్తరం వైపు కూర్చుని అన్నం తినడం వల్ల డబ్బు, జ్ణానం, ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇలా కూర్చోవడం కెరీర్ పరంగా కూడా పురోగతి సూచిస్తుంది. ఉత్తర దిశలో కూర్చోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులకు చదువు బాగా ఒంటపడుతుంది. యువత అన్నింట్లోనూ రాణించేందుకు అవకాశం ఉంటుంది. ఉత్తరం వైపు కూర్చుని తినడం శ్రేయస్కరం.
పడమర
పడమర దిక్కు కూర్చుని భోజనం చేయడం కూడా మంచిదే. దీంతో సంపదలు పెరుగుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు సాధించొచ్చు. భోజనం చేసే సమయంలో కూర్చునే దిశల్లో పడమర కూడా మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతుంటారు. ఇందులో భాగంగానే అటు వైపు కూడా కూర్చుని తినడం అలవాటు చేసుకుంటే మంచిదే.
దక్షిణం
భోజనం చేసేటప్పుడు దక్షిణం వైపు మాత్రం కూర్చోవద్దు. ఇది యముడి దిక్కు. అందుకే అందరు దక్షిణం అంటేనే భయపడతారు. ఎప్పుడు కూడా దక్షిణం వైపు కూర్చుని భోజనం చేయడం మానుకోవడమే మంచిది. ఒకవేళ అలా చేసినట్లయితే అనారోగ్యాలు కలుగుతాయి. తల్లిదండ్రులకు కూడా మంచిది కాదు. వీలైనంత వరకు దక్షిణం వైపు కూర్చుని భోజనం చేయడం సురక్షితం కాదు.