
Vastu Tips: ఇంటికి ఈశాన్యం మూల ప్రధానమైనది. వాస్తు ప్రకారం దీనికి అత్యంత విలువ ఇస్తారు. ఈశాన్య దిశలో సానుకూల ఫలితాలు ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు ఇబ్బందులు తప్పవు. మన ఆరోగ్యం, సంపదలకు మూల కారణం ఈశాన్యమే అవుతుంది. ఈశాన్యం సరిగా లేకపోతే అడ్డంకులు వస్తాయి. లోపాలను తొలగించుకోవడానికి ఈశాన్య మూలలో వాస్తు నివారణోపాయాలు తీసుకోవాలి. ఈశాన్య మూలలో బెడ్ రూం ఉండకూడదు. దీని వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఈశాన్యంలో పడక గది వద్దు
ఈశాన్య మూలలో పడక గది ఉంచుకోవద్దు. ఒక వేళ ఈశాన్యంలో బెడ్ రూం ఉంటే దక్షిణం వైపు తలపెట్టి నిద్రిస్తే ఉపశమనం కలుగుతుంది. వాస్తు ప్రకారం ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోవడం మంచిది. ఈశాన్య మూలలో బెడ్ రూం ఉంటే అక్కడ వాస్తు యంత్రం ఉంచడం శ్రేయస్కరం. నీలం, పసుపు లేదా ఆకుపచ్చ రంగుల పెయింట్ వేయించుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈశాన్య మూల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు వాస్తు సమస్యలు వేధించడం సహజమే. అందుకే ఈశాన్యాన్ని అజాగ్రత్తగా వదిలేయొద్దు.
వంట గది ఉంచుకోకూడదు
ఈశాన్యంలో వంట గది ఉంచుకోకూడదు. కిచెన్ ఎప్పుడు కూడా ఆగ్నేయంలోనే ఉంచుకోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి. ఈశాన్య మూలలో శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ వస్తువులు ఉంచుకోకూడదు. లేదంటే దుష్ర్పభావాలు కలుగుతాయి. ఈశాన్యంలో బాత్ రూం కూడా నిర్మించుకోవద్దు. ఒకవేళ ఉన్నట్లయితే టాయిలెట్లలో కర్పూరం లేదా సువాసన కలిగించే కొవ్వొత్తులను కాల్చితే మంచి ఫలితాలు వస్తాయి. టాయిలెట్ తలుపులు ఎప్పుడు మూసి ఉంచితేనే మంచిది.

సెప్టిక్ ట్యాంకు
ఈశాన్య మూలలో సెప్టిక్ ట్యాంకు ఉండకూడదు. ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా ఈశాన్యం మూలలో ఉండొద్దు. వాస్తు దోష నివారణకు ట్యాంకుకు ఎరుపు రంగు వేయడం ఉత్తమం. ఈశాన్య దిశకు కుబేరుడు అధిపతి. అందుకే ఆ దిశలో చీపుర్లు, చెత్తబుట్టలు పెట్టొద్దు. ఫర్నిచర్ ఉంచుకోవద్దు. ఒకవేళ ఉంచితే మనకు నష్టాలు రావడం తప్పదు. వాస్తు దోష నివారణకు పిరమిడ్ ఉంచుకోవాలి. ప్రతి రోజు ఈశాన్య దిశలో కొవ్వొత్తిని గానీ లైటును కానీ వెలిగించండి. నేలను దొడ్డు ఉప్పుతో శుభ్రం చేసుకుంటే దోషాలు తొలగిపోతాయి.