
Vastu Tips : మనకు వాస్తు శాస్త్రంలో ఎన్నో విషయాలు చెబుతారు. వాటిని ఆచరించి మనకు కష్టాలు లేకుండా చూసుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లే పెద్ద సమస్యలకు తెర తీస్తాయి. అందుకే ఇంటి వాస్తు విషయంలో అశ్రద్ధ వద్దు. మన ఇంటి ఎదుట ఏ వస్తువులు ఉంచుకోవాలి? వేటిని ఉంచుకోకూడదు అని స్పష్టంగా అవగాహన ఉంచుకోవాలి. లేకపోతే మనకు ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి. ఈ నేపథ్యంలో వాస్తు చిట్కాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంటి ఆవరణలో ఏ వస్తువులు ఉంచడం వల్ల ఎలాంటి ప్రతికూల అంశాలు ఎదురవుతాయో తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం మనం ఏం చేయాలి? ఎలా చేయాలనే విషయాలు తెలుసుకుంటే మంచిది.
వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంటి ఎదురుగా పెట్టకూడదు. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకే మేలు కలుగుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో మనం కొన్ని విషయాలు పక్కన పెట్టేస్తున్నాం. అవే మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి బయట కొన్ని వస్తువులను ఉంచకూడదు. తెలియక చేసినా తెలిసి చేసినా దాని ప్రభావాలు ఎదుర్కోక తప్పదు. అందుకే జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు అనుకూల ఫలితాలు వస్తాయి.

ఇంటి ప్రధాన ద్వారం వెలుపల ఉండే ధూళి కుటుంబ సభ్యులపై పడితే ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. దీంతో మన ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పాలు చేస్తాయి. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఎదుట చెత్త డబ్బా పెట్టుకుని అంతా అందులో వేయాలి. పనికి రాని వస్తువులను కూడా అందులో పడేయాలి. ప్రధాన ద్వారం వద్ద చెత్త కనిపిస్తే వెంటనే దాన్ని చెత్త డబ్బాలే వేయాలి. ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండాలి. అలా ఉంటేనే మన ప్రగతికి మార్గం ఏర్పడుతుంది.

ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు. ఇలా ఉంటే మనకే అరిష్టం కలుగుతుంది. ఇంటి దగ్గర చెట్లు లేకుండా చూసుకోవాలి. పెద్ద వృక్షాలు ఉంటే వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇంటికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు. ఇంటి ముందు గుడి కూడా ఉండవద్దు. మతపరమైన స్థలమున్నా ఇబ్బందులు వస్తాయి. ఇంటి తలుపులపైన కిటికీ ఉండకూడదు. అలా పెడితే నష్టాలు కలుగుతాయి. ఇలా వాస్తు ప్రకారం మన ఇల్లు ఉండేలా చూసుకుంటే మనకు కష్టాలు రాకుండా ఉంటాయి.