Tulsi Plant: హిందూ సంప్రదాయంలో తులసి ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఇందులో ఆయుర్వేద గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మన పూర్వీకులు ఏనాడో తులసిలో ఉన్న విలువలను గ్రహించే దాన్ని ఇంటి ముందు పెట్టుకుని పూజించాలని ఆచారంగా తీసుకొచ్చారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు చూస్తే మనకే ఆశ్చర్య కలిగిస్తుంది. పూజించే మొక్కే అయినా అందులో ఆయుర్వేద విలువలు ఎన్నో ఉన్నాయి. దీంతో మనకు తులసి మందులా కూడా పనిచేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు.
మందులా..
పురాణాల్లో కూడా తులసి గురించి అద్భుతంగా వర్ణించారు. తులసి అంటే శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది. అందుకే తులసి కింద లక్ష్మీదేవి విష్షువు కొలువుంటారని చెబుతారు. అందుకే తులసికి పూజ చేసే సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అనుకూల ఫలితాలకు బదులు ప్రతికూలతలు వచ్చే ప్రమాదముంటుంది.
దీపం
తులసి కోట ఎదుట ప్రతి సాయంత్రం దీపం వెలిగించాలి. అది ఆవునెయ్యితో చేసిన దీపం అయి ఉంటే మంచిది. ప్రమిదకు కాస్త పసుపు రాయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. జీవితంలో ఎదగాలంటే తులసిని పూజించాలి. దానికి చేయాల్సిన పనులు చేస్తే మనకు మంచి లాభాలు ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఉదయం
తులసి కోట దగ్గర ఉదయం పూట పిండితో తయారు చేసిన దీపం వెలిగించాలి. మరుసటి రోజు దాన్ని ఆవుకు తినిపించాలి. ఇలా చేస్తే మనకు క్రమంగా మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి, అన్నపూర్ణ దేవి అనుగ్రహం కలగడం వల్ల మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సమస్యలు తీరి మంచి పొజిషన్ లోకి వెళ్లడం ఖాయం. ఇలా తులసి మొక్కను మంచిగా పూజిస్తే మనకు మంచే జరుగుతుంది.
నిరంతరం
తులసి కోట కింద నిరంతరం దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిలోకి వస్తుంది. తులసికి ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో నీళ్లు పోయకూడదు. ఇలా పోస్తే మనకు నష్టాలు వస్తాయి. అంతేకాదు ఆ రోజుల్లో దాని ఆకులు కూడా తెంచకూడదు. ఇలా ఈ నియమాలు పాటించడం వల్ల మనకు తులసి అనుగ్రహం కలుగుతుంది.