Vastu Tips: ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకుంటే ఇల్లును మించి స్వర్గం ఉండదని కొందరు అంటారు. ఉదయ నుంచి రాత్రి వరకు ఎన్నో విధుల్లో మునిగి, బిజీ వాతావరణంలో గడిపిన వారు ఇంట్లో కాస్త రిలాక్స్ అయితే కష్టమంతా మరిచిపోతారు. స్వేచ్ఛ, స్వతంత్రాలు ఇంట్లో మాత్రమే ఉంటాయి. అందుకే ఎన్ని హాస్టళ్లు ఉన్నా.. కాస్త కష్టం అయినా ప్రత్యేక గదిలో ఉండడానికి ఇష్టపడుతారు. ఉద్యోగం, వ్యాపారం చేసే వాళ్లు ఇంట్లోకి రాగానే రిలాక్స్ అవుతారు. అయితే ఆ ఇల్లు శుభ్రంగా ఉంటే మరింత సంతోషంగా ఉంటారు. ఇంటిని శుభ్రం చేయడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. ఇక పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకే లక్స్మీ దేవి అడుగుపెడుతుందని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతారు. అందువల్ల ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా బ్యాచ్ లర్ గది కంటే ఫ్యామిలీ ఉండే ఇల్లు పరిశుభ్రంగానే ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో మహిళలు సైతం ఉద్యోగాలు చేయడంతో ఇంటిని శుభ్ర పరచడంలో కాస్త నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సమయ పాలన లేకుండా.. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. కొందరు మహిళలు ఉద్యోగాలు చేయకపోయినా వేళ పాళా లేకుండా ఇంటిని శుభ్రం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉండడం అటుంచితే వాస్తు శాస్త్రం ప్రకారం దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లేనని అంటున్నారు. కొన్ని ప్రత్యేక సమయంలో తడి గుడ్డ తో ఇంటిని అస్సలు తుడువద్దు అని అంటున్నారు. అయితే ఏ సమయాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు? ఆ వివరాల్లోకి వెళితే..
ఇంటి నిర్మాణం వాస్తు శాస్త్రం ప్రకారం జరుగుతంది. అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు వాస్తు శాస్త్రం ప్రకారం సక్రమమైన పద్దతుల్లో ఉంచాలి. వీటితో పాటు కొన్ని పనులు కూడా సరైన సమయంలోనే నిర్వహించాలని ఈ శాస్త్రం తెలుపుతుంది. ప్రతి ఒక్కరికీ ఇంటిని శుభ్రం చేసుకోవాలని ఉంటుంది. ప్రస్తుతం ప్రతీ ఇంట్లో టైల్స్ ఉండడం వల్ల చీపురుతో కాకుండా గుడ్డతో క్లీన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కాస్తంత దుమ్ము కూడా నిలవదు. కానీ ఈ పనిని బ్రహ్మ ముహుర్తంలో మాత్రమే చేయాలంటున్నారు. సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఆనారోగ్యాలకు గురికాకుండా ఉంటారు. సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేయడం వల్ల సూర్య కిరణాలు ఇంట్లో పడితే ఆ రోజంతా వారికి సానుకూల వాతావరణం ఉంటుంది.
అయితే కొందరు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనే తపనతో పట్టపగలు చేస్తారు. లేదా సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేస్తారు. మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటారు. ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేయడం వల్ల సౌరశక్తి ప్రయోజనాలు పొందలేదు. సూర్యాస్తమం సమయంలో ఇంటిని శుభ్రం చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీంతో ఇంట్లో ధనం నిల్వదు. ఆ ఇంట్లోని మాట ఎవరూ వినరు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోకుండా అనారోగ్యాలు సంభవిస్తాయి. అందువల్ల ఇంటి శుభ్రం చేసే పనిలో నియమాలు కచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతున్నారు. ఇక ఇంటిని శుభ్రం చేసే చీపురును లక్ష్మీదేవతగా భావిస్తారు. ఆ చీపురును ఈశాన్యంలో ఉంచకూడదని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో చీపురుతో శుభ్రం చేయొద్దని, ఇలా చేయడం వల్ల అరిష్టం అని అంటున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Vastu tips cleaning the house at noon but as if in trouble
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com