Vastu Tips : చీపురు ఈ సమయంలో కొంటే ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానించినట్లే..

చీపురును లక్ష్మీదేవతతో పోలుస్తారని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో చీపురును కొన్ని సమయాల్లో కొనుగోలు చేయరాదని అంటున్నారు. ఏ సమయంలో అంటే?

Written By: Chai Muchhata, Updated On : February 21, 2024 9:58 am

chipuru

Follow us on

Vastu Tips :  వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని పనులు జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తాయి. ముఖ్యంగా ఇల్లు సంతోషంగా ఉండాలంటే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని కొందరు పండితులు చెబుతారు. అలాగే ఇంట్లో లక్ష్మీ దేవత కొలువై ఉండాలంటే కొన్ని పాటించాలని చెబుతున్నారు. ప్రతి ఇంటిని శుభ్రం చేయడానికి చీపురు వాడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న దుమ్మునంతా చీపురు తీసేస్తుంది. ఆ తరువాత ఓ మూలన దీనిని పడేసి పట్టించుకోం. కానీ చీపురును లక్ష్మీదేవతతో పోలుస్తారని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో చీపురును కొన్ని సమయాల్లో కొనుగోలు చేయరాదని అంటున్నారు. ఏ సమయంలో అంటే?

ప్రతి రోజు చీపురును ఉపయోగించిన తరువాత దీనిని ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు. కచ్చితంగా చీపురును నైరుతి, వాయువ్య దిశలో కనిపించకుండా పెట్టాలి. పొరపాటున కూడా ఈశాన్యం మూల, ఆగ్నేయంలో ఉంచకూడదని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. చీపురు పాడైపోయినప్పుడు వెంటనే కొనుగోలు చేస్తారు. అయితే ఏ సమయంలో పడితే ఆ సమయంలో.. ఎటువంటి రోజైనా చీపురును కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి.

చీపురుపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. అందువల్ల కొత్త చీపురును ఇంట్లోకి తీసుకురావడం అంటే దేవతను ఆహ్వానించినట్లే. అందువల్ల చీపురును పొరపాటున కూడా శుక్లపక్షంలో కొనుగోలు చేయరాదని అంటున్నారు. అలా చేస్తే ఇంట్లోకి దురదృష్టాన్ని ఇంట్లోకి ఆహ్వానించినట్లేనని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అలాగే శుక్రవారం, మంగళవారం, మహాలయ పక్షం సమయాల్లో చీపురును కొనుగోలు చేయరాదు. అమావాస్యపు రోజుల్లో కూడా చీపురును కొనడం అంతమంచిది కాదని పండితులు చెబుుతున్నారు.

చీపురు అవసరం తక్కవే ఉన్నా.. దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇల్లు సంతోషంగా ఉంటుంది. అలాగే ఆ ఇంటిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. అందువల్ల పైన చెప్పిన సమయాల్లో కాకుండా మంచి రోజుల్లో చీపురును కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి.అలా చేయడం వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.