Vastu: మనదేశంలో వాస్తు కు ఉన్న .ప్రాధాన్యం తెలిసిందే. ఇల్లు కట్టుకుంటే పక్కా వాస్తు ప్రకారం లేకపోతే ఎన్ని లక్షలు పెట్టి కట్టినా దాన్ని పడగొట్టే సందర్భాలు అనేకం. దీంతో వాస్తు అంటే మన వారికి అమితమైన ప్రేమ. వాస్తు ప్రకారం లేకపోతే ఎంతటి భవనమైనా పనికి రాదనే భావం అందరిలో ఉంటుంది. అందుకే వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకునేందుకే ఇష్టపడుతుంటారు. దాని కోసం ఎంతైనా ఖర్చు చేసి పక్కా వాస్తు ప్రకారం ఉంటేనే అందులో నివాసం ఉంటారు. లేదంటే వదిలేస్తారు. వాస్తు ప్రకారం నడుచుకోవాలంటే కొన్ని నిబంధనలు కూడా అనుసరించాలి.

రూ. లక్షలు ఖర్చు పెట్టి సొంతింటి కల నెరవేర్చుకుంటాం. అలాగే అందులో కొన్ని నియమాలు కూడా పాటిస్తే జీవితం నందనవనంలా ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం పడక గదిలో ఏవి ఉండాలో ఏమి ఉండకూడదో అనే దానిపై ఓ సారి ఆలోచిద్దాం. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొనాలంటే వాస్తు ప్రకారం కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. బెడ్ రూంలో టీవీ, కంప్యూటర్ ఉంచుకోకూడదు. ఉంచుకుంటే వాస్తుదోశం ఉంటుందనేది శాస్త్రం. పడక గది నైరుతి, దక్షిణం దిశలో ఉంచుకునేలా ఏర్పాట్లు చేసుకోండి.
Also Read: పవన్ కళ్యాణ్ పై పడ్డ వైసీపీ నేతలు.. సమస్యలు వదిలేసి వ్యక్తిగత దాడి?
పడక గదిలో చనిపోయిన వారి చిత్రాలు ఉంచకూడదు. అనవసరమైన వస్తువులతో గదిని నింపేందుకు ఉత్సాహం చూపించొద్దు. అవసరమైన వాటిని మాత్రమే బెడ్ రూంలో ఉంచుకోండి. భార్యా భర్తల మధ్య అన్యోన్యం పెరగాలంటే భార్య భర్తకు ఎడమ వైపునే పడుకోవాలి. లేదంటే కుటుంబంలో కలతలు వస్తాయి. సంసారం అల్లరిగా మారుతుంది. మంచం కూడా ఒకటే ఉండాలి. వేరువేరు మంచాలు ఉండకూడదదు. పైగా అది చెక్కతో చేసిన మంచమే అయి ఉండాలి. ఇనుముతో వాడకూడదు.

దక్షిణం వైపు తల ఉత్తరం వైపు కాళ్లు పెట్టుకుని నిద్రించాలి. తప్పుగా పడుకుంటే కూడా అనర్థాలు చోటుచేసుకుంటాయి. మంచం కూడా చతురస్రంగా ఉండాలి. లేకపోతే కూడా అరిష్టమే. వాస్తు శాస్ర్త రీత్యా ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. గృహ వాస్తు శాస్ర్తం ప్రకారం అన్నింట్లో జాగ్రత్తలు తీసుకుంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే సమస్యలు చుట్టుముడతాయి. జాతకాలు తారుమారవుతాయి. వాస్తు ప్రకారం చూసుకుని ఇంటిని అందంగా అలరింకరించుకుంటే ఏ ఇబ్బందులు తలెత్తవు
Also Read: వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చను.. పొత్తులపై పవన్ సంచలన ప్రకటన