Vastu Dosha: మనం వాస్తును నమ్ముతాం. వాస్తు పద్ధతులు పాటిస్తాం. కానీ మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. దీంతో మనకు ఇబ్బందులు వస్తాయి. కొన్ని పనులు సాధారణంగానే అనిపించినా వాటిని చేయడం వల్ల కష్టాలు వస్తాయని తెలుసుకోకుండా చేస్తే మనకు దరిద్రమే. మన ఇంట్లో వాస్తును పాటించడంతో పాటు కొన్ని చేయకూడని పనుల మీద జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అవి మనకే తంటాలు తీసుకురావడం ఖాయం.
ఇంట్లో పగిలిన అద్దం ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంచుకుంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో మనకు ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ఎప్పుడు కూడా భార్య ఎంగిలి కంచాన్ని భర్త చేతితో పట్టుకోకూడదు. ఇలా చేస్తే కూడా ప్రతికూల ప్రభావాలు వస్తాయి. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంభోగంలో పాల్గొనకూడదు. పొరపాటు అలా చేస్తే అరిష్టమే.
చీకటిలో భోజనం తినకూడదు. ఇల్లు ఊడ్చే చీపురును నిలబెట్టకూడు. రోకలి బండను కడగకుండా ఉంచకూడదు. రోలు, రోకలి కడగకుండా ఉంచితే అశుభం కలుగుతుంది. లైట్లు వేశాక ఇల్లు ఊడవడం మంచిది కాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అన్నం పడేయకూడదు. నేల మీద పడ్డ అన్నాన్ని తొక్కకూడదు.
ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఎడమ చేతిని వాడరాదు. కుడి చేతితోనే తీసుకోవాలి. కొందరు ఆడాళ్లు పడుకునే సమయంలో తాళి, గాజులు పక్కన పెట్టేస్తారు. ఇది సరైంది కాదు. కొంతమంది స్నానం చేసి మళ్లీ విప్పిన బట్టలే వేసుకుంటారు. ఇదికరెక్టు కాదు. ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లో కొలువుంటుంది.