https://oktelugu.com/

Ashu Reddy: డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న అషురెడ్డి… డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరితో లింకులు?

పోలీసుల వద్ద ఉన్న రిమాండ్ రిపోర్ట్ లో 12 మంది పేర్లు ఉన్నాయి. వారిలో అషురెడ్డి ఒకరని తెలుస్తుంది. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్ ఈ లిస్ట్ ఉన్న ప్రముఖులు. అ

Written By:
  • Shiva
  • , Updated On : June 24, 2023 / 10:37 AM IST

    Ashu Reddy

    Follow us on

    Ashu Reddy: టాలీవుడ్ పై డ్రగ్స్ ఆరోపణలు కొత్తేమీ కాదు. 2018లో డ్రగ్ పెడ్లర్ కాల్విన్ అరెస్ట్ కాబడ్డాడు. విచారణలో పెద్ద తలకాయలు పేర్లు తెరపైకి వచ్చాయి. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, సుబ్బరాజ్, రవితేజ, నవదీప్, తరుణ్, ముమైత్ ఖాన్ శ్యామ్ కే నాయుడు, తనీష్ వంటి సెలెబ్రిటీలు విచారణ ఎదుర్కొన్నారు. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. రకుల్, రానాతో పాటు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. తర్వాత ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

    తాజా నిర్మాత కేపీ చౌదరి పట్టుబడగా… మరోసారి టాలీవుడ్ లో వణుకు మొదలైంది. విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో అనే ఉత్కంఠ మొదలైంది. కాగా అషురెడ్డితో కేపీ చౌదరి అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని విచారణలో తేలింది. అతడు ఆమెతో వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. వీరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటీ? తరచుగా అషురెడ్డితో కేపీ చౌదరి ఎందుకు టచ్ లో ఉన్నాడు? అనే కోణంలో విచారణ జరుగుతుంది.

    పోలీసుల వద్ద ఉన్న రిమాండ్ రిపోర్ట్ లో 12 మంది పేర్లు ఉన్నాయి. వారిలో అషురెడ్డి ఒకరని తెలుస్తుంది. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్ ఈ లిస్ట్ ఉన్న ప్రముఖులు. అలాగే ఐటమ్స్ సాంగ్స్ లో నటించిన ఒక హీరోయిన్ కూడా ఉన్నారని తెలుస్తుంది. కేపీ చౌదరి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న అకౌంట్స్ వివరాలు సేకరిస్తున్నారు.

    మొదటిసారి అషురెడ్డి పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తుంది. ఆమె డ్రగ్ పెడ్లరా లేక కన్స్యూమరా? లేక ఆమెకు ఎలాంటి సంబంధం లేదా? అనేది తెలియాల్సి ఉంది. గతంలో కొన్ని సినిమాలు నిర్మించిన కేపీ చౌదరి గోవాలో పబ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ నుండి వచ్చే టాలీవుడ్ ప్రముఖులకు తన పబ్ లో డ్రగ్స్ సప్లై చేస్తాడని తెలుస్తుంది. హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతూ కేపీ చౌదరి పట్టుబట్టాడు. తరుణ్, నవదీప్ సైతం గోవాలో పబ్స్ నిర్వహిస్తూ డ్రగ్స్ దందా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.