Homeఎడ్యుకేషన్UPSC Final Result 2022: సివిల్స్ ర్యాంక్స్ : తెలుగు రాష్ట్రాల నుండి టాప్ 100లో...

UPSC Final Result 2022: సివిల్స్ ర్యాంక్స్ : తెలుగు రాష్ట్రాల నుండి టాప్ 100లో ఎంతమందంటే?

UPSC Final Result 2022: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్‌–2022 పరీక్షల తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతోపాటు 50 వరకు ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించారు. మొత్తం 933 మందిని ఎంపికి చేసినట్లు తెలిపింది. జనరల్‌ – 345, ఈడబ్ల్యూఎస్‌ – 99, ఓబీసీ – 263, ఎస్సీ – 154, ఎస్టీ – 72 మంది ఎంపికయ్యారు. వీరితోపాటు కన్సాలిడేటెడ్‌ రిజర్వు లిస్టులో ఆయా కేటగిరీల నుంచి 178 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. మొత్తంగా 1,022 మందిని ఆయా పోస్టులకు ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరిలో ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38 మంది, ఐపీఎస్‌కు 200 మందిని కేటాయించారు. ఇతర కేంద్ర సర్వీసెస్‌లకు సంబంధించి గ్రూప్‌–ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌–బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అధిక ర్యాంకులు
సివిల్స్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకుల్లో తొలి 4 ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకును ఇషితా కిషోర్‌ సాధించగా గరిమ లోహియా, నూకల ఉమా హారతి, స్మృతి మిశ్రాలు వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దాదాపు 50 మందికి ర్యాంకులు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 22, 33, 40, 200, 217, 222, 285, 384, 410, 460, 510, 558, 583, 593, 640, 759, 801, 827, 885 ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు.

11.35 లక్షల మంది దరఖాస్తు
సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు 11.35 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 5.73 లక్షల మంది (50.51 శాతం) మంది మాత్రమే గతేడాది జూన్‌ 5న జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరయ్యారు. వారిలో 130,90 మంది మెయిన్స్‌ పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి సెప్టెంబర్‌ 16 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,529 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా చివరకు 933 మంది ఎంపికయ్యారు.

తెలుగు రాష్ట్రాల నుంచి 80 వేల మంది హాజరు..
సివిల్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 80,707 మంది హాజరయ్యారు. వారిలో 500 మంది వరకు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇంటర్వ్యూలకు 100 మంది వరకు ఎంపికవ్వగా వారిలో 50 మంది వరకు ర్యాంకులు సాధించగలిగారని ఆయా కోచింగ్‌ సంస్థల నిర్వాహకులు తెలిపారు.

ర్యాంకుల వారీగా తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులు
3 ఎన్‌. ఉమా హారతి
22 జీవీఎస్‌ పవన్‌ దత్తా
33 తరుణ్‌ పట్నాయక్‌ మాదల
40 సాయి ఆశ్రిత్‌ శాఖమూరి
54 రిచా కులకర్ణి
60 మలియె శ్రీ ప్రణవ్‌
78 ఉత్కర్ష్‌ కుమార్‌
87 అయాన్‌ జైన్‌
94 ఆవుల సాయి కష్ణ
110 నిధి పాయ్‌
132 అనుగు శివమూర్తిరెడ్డి
157 రాళ్లపల్లి వసంతకుమార్‌
189 షేక్‌ హబీబుల్లా
217 రావ్ల జయసింహారెడ్డి
243 కాసిరాజు పవన సాయి సాహిత్య
270 బొల్లం ఉమామహేశ్వరరెడ్డి
285 చల్లా కల్యాణి
292 పలువాయి విష్ణువర్థన్‌రెడ్డి
293 గ్రంధి సాయికృష్ణ
297 షివిన్‌ చౌదరి
311 వీరగంధం లక్ష్మీ సునీత
313 కె.ఎన్‌.చందన్‌ జాహ్నవి
346 ఎన్‌.చేతన్‌రెడ్డి
384 తెప్పలపల్లి సుశ్మిత
409 ఇషాన్‌ అగర్వాల్‌
410 డొంగ్రె రేవయ్య
414 చంద్రశేఖర్‌ శంకల
426 సీహెచ్‌.శ్రవణ్‌కుమార్‌రెడ్డి
459 చాణక్య ఉదయగిరి
464 సి.సమీరారాజా
469 బొడ్డు హేమంత్‌
480 గోపీకృష్ణ.బి
510 భువన ప్రణీత్‌ పప్పుల
548 దామెర్ల హిమవంశీ
558 రుత్విక్‌ సాయి కొట్టే
559 డి.మనోజ్‌
583 యర్రంశెట్టి ఉషారమణి
630 ఎస్‌.దీప్తి చౌహాన్‌
640 తుమ్మల సాయికృష్ణారెడ్డి
742 రామ్‌దేని సాయినాధ్‌
759 జి.అక్షయ్‌ దీపక్‌
805 మన్నం సుజిత్‌ సంపత్‌
817 సాహిల్‌ మీనా
846 బెండుకూరి మౌర్యతేజ్‌
866 నాగుల కృపాకర్‌

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular