https://oktelugu.com/

Draupadi: ద్రౌపది ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు కన్యగా మారేదట.. ఎందుకో తెలుసా?

స్వయంవరంలో భాగంగా అర్జునుడు ద్రౌపదిని గెలుస్తాడు. దీంతో ఆమెను తీసుకొని ఇంటికి వెళుతాడు. తాను గెలిచిన బహుమతిని చూడాలని కుంతిని కోరుతాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 25, 2023 / 05:03 PM IST
    Follow us on

    Draupadi: ‘తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి..’అంటారు. నాటి మహాభారతంలో భవిష్యత్ లో ఏం జరుగుతుందో ముందే చెప్పారు. అందుకే కొన్ని సందర్భాల్లో మహాభారతంను ఆదర్శంగా తీసుకుంటారు. ఒక వ్యక్తికి ఏదో ఒక విషయంలో మహభారతంలో జరిగిన విషయాలు తారసపడుతాయి. ఇందులో కుళ్లు కుతంత్రాలు, నీతి, ధర్మం ఇలా అన్ని రకాల గుణాలు కనిపిస్తాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ద్రౌపది ఐదుగురు భర్తలతో కలిసి ఉండడం. ద్రౌపతి ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు కన్యగా మారేదట. అందుకు కారణం ఏంటంటే?

    స్వయంవరంలో భాగంగా అర్జునుడు ద్రౌపదిని గెలుస్తాడు. దీంతో ఆమెను తీసుకొని ఇంటికి వెళుతాడు. తాను గెలిచిన బహుమతిని చూడాలని కుంతిని కోరుతాడు. దీంతో అర్జునుడు తీసుకొచ్చింది తన భార్య అని చూడకుండానే పరధ్యానంలో ఐదుగురిని పంచుకొమ్మని చెబుతుంది. తల్లి మాటను కాదనలేక ద్రౌపదిని ఐదుగురిని పంచుకుంటారు. అయితే ద్రౌపదిని ఐదుగురిని పంచుకునే క్రమంలో ఏ భర్త వద్ద గొడవ లేకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు కొన్ని నియమాలు పాటించేది.

    ఒక నెల పాటు ఒకరి దగ్గర ఉండి.. మరోనెలలో మరో భర్త వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక భర్త వద్ద నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు ద్రౌపది కన్యగా మారేదట. అందుకు కారణమేంటంటే.. ద్రౌపది అందరిలాగా కడుపులో నుంచి జన్మించలేదు. యుక్త వయసులో ఉన్న కన్యగా అగ్ని నుంచి పుట్టింది. అందుకే ఆమెను యజ్ఞసేని అని అంటారు. ఈ క్రమంలో ద్రౌపది ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు అగ్నిలో నుంచి నడిచేది. దీంతో ఆమె కన్యగా మారేది.

    ఇదిలా ఉండగా 5గురు అన్నదమ్ముల మధ్య మరో నియమం ఉండేది. ద్రౌపది ఎవరి దగ్గర నైనా ఉన్నప్పుడు వారి వద్దకు ఇంకొకరు వెళ్లరారు. కానీ ఓసారి పశువుల కాపరి వచ్చి తన పశువులను దొంగిలించారని, కాపాడమని అర్జునుడిని కోరుటారు. దీంతో అర్జునుడు నియమం తప్పి ధర్మరాజు వద్దకు విల్లు కోసం వెళుతాడు. ఈ సమయంలో ద్రౌపది అక్కడే ఉంటుంది. దీంతో విల్లును తీసుకొని పశువులను రక్షిస్తాడు. కానీ ఆ తరువాత నియమం ప్రకారం అరణ్యవాసం చేస్తాడు.