Chiranjeevi: చిరంజీవి తో చేయాల్సిన చంద్రముఖి రీమేక్ ఎందుకు ఆగిపోయింది అంటే..?

ఈ సినిమా ను మొదట డైరెక్టర్ తమిళం లో రజినీకాంత్ తో, తెలుగు లో చిరంజీవి తో చేయాలని ప్లాన్ చేసాడు కానీ అది వర్క్ ఔట్ అవ్వలేదు ఎందుకు అంటే డైరెక్టర్ పి వాసు ఈ సినిమా స్టోరీ ని చిరంజీవి కి చెబితే...

Written By: Gopi, Updated On : September 25, 2023 5:12 pm
Follow us on

Chiranjeevi: ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరితో చిరంజీవి ఒకరు ఈయన ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. నిజానికి ఆయన చేసిన చాలా సినిమాలు తెలుగు లో ఇండస్ట్రీ హిట్లు కూడా కొట్టాయి. అయితే ఇండస్ట్రీ లో ఎప్పటి నుంచే నడుస్తున్న టాక్ ఏంటి అంటే రజినీకాంత్ చేసిన చంద్రముఖి సినిమా సూపర్ సక్సెస్ అయింది.

ఈ సినిమా ను మొదట డైరెక్టర్ తమిళం లో రజినీకాంత్ తో, తెలుగు లో చిరంజీవి తో చేయాలని ప్లాన్ చేసాడు కానీ అది వర్క్ ఔట్ అవ్వలేదు ఎందుకు అంటే డైరెక్టర్ పి వాసు ఈ సినిమా స్టోరీ ని చిరంజీవి కి చెబితే ఆయనకి ఈ సినిమా స్టోరీ పెద్దగా నచ్చలేదట ఇక దాంతో పి వాసు రజినీకాంత్ తో తమిళం లో చేసి అదే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు…

ఈ సినిమా తమిళం, తెలుగు రెండు బాషల్లో కూడా సూపర్ సక్సెస్ అయింది. నిజానికి ఈ సినిమా చిరంజీవి చేసి ఉంటే ఇంకా తెలుగులో పెద్ద హిట్ అయ్యేది అని చాలా మంది అభిమానులు వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.నిజానికి ఈ సినిమా తెలుగు లో సూపర్ సక్సెస్ అవ్వడంతో చిరంజీవి వాళ్ల సన్నిహితుల దగ్గర ఈ సినిమా చేస్తే బాగుండేది అని చెప్పినట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా లో జ్యోతిక ని చంద్రముఖి అవాహించడం ఆమె చేసే డాన్స్ లు ఇవన్నీ సినిమా చూస్తుంటే మనల్ని విపరీతంగా భయానికి గురి చేస్తాయి.

నిజానికి ఈ సినిమా ఒక సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ అనే చెప్పాలి. ఒక పెద్ద హీరో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ హార్రర్ జానర్ లో సినిమా చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…ఇక ఇప్పుడు ఈ సినిమా కి సంభందించిన సీక్వెల్ కూడా వస్తుంది. ఇందులో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్స్ లో చేస్తున్నారు…చంద్రముఖి రేంజ్ లో ఈ సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి…