Umran Malik: శ్రీలంకతో జరిగిన తొలి వన్డే లో ఉమ్రాన్ మాలిక్ వేసిన ఫాస్టెస్ట్ బంతులతో లంక బ్యాటర్లు భయపడ్డారు గంటకు 156 కిలోమీటర్ల వేగంతో బంతిని వేయడంతో గతంలో తన రికార్డును తానే అధిగమించాడు. ఇంతకుముందు గంటకు 155 కిలోమీటర్ల వేగంతో రికార్డును తానే బద్దలు కొట్టడం గమనార్హం. లంకతో మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్ లో 14వ ఓవర్లో మాలిక్ ఈ ఘనత సాధించాడు. ఉమ్రాన్ బౌలింగ్ కు లంక బ్యాటర్లకు వణుకు పుడుతోంది. మెరుపు వేగాన్ని తట్టుకునే శక్తి వారికి చాలడం లేదు.

ఈ ఓవర్ లో వరుసగా గంటకు 147,151,156,146,145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడంతో బ్యాట్స్ మెన్ ఆందోళనలో పడ్డాడు. ఉమ్రాన్ బౌలింగ్ కు బెంబేలెత్తిపోయిన అసలంక వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రీప్లేలో బ్యాట్ కు తాకినట్లు కనిపించలేదు. అతడి ప్యాడ్ కు తాకుతూ వికెట్ కీపర్ చేతిలో పడింది. కానీ ఉమ్రాన్ వేగానికి భయపడి అతడు నిష్క్రమించినట్లు తెలుస్తోంది. అసలంక మైండ్ బ్లాక్ అయింది. ఐపీఎల్ లో కూడా ఉమ్రాన్ గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం విశేషం.
ఉమ్రాన్ బౌలింగ్ పై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అతడి మెరుపు వేగంతో ఎదుటి వారిని భయపెట్టేంత స్థాయిలో బౌలింగ్ చేయడంతో బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో జట్టుకు విజయం అందిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్టకు 373 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లి 113, రోహిత్ శర్మ 83, శుభ్ మన్ గిల్ 70 పరుగులు చేశారు. లంక బౌలర్లలో కసున్ రజతా మూడు వికెట్లు తీయగా దిల్షన్ మదుషంక, చమిక కరుణ రత్నే, డసన్ షనక, ధనుంజయ డిసిల్వా చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్యచేధనలో శ్రీలంక 136 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పటికే టి20 సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డే సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే తొలి వన్డేలో విజయం సాధించింది. మన జట్టులో ఉమ్రాన్ మాలిక్ తనదైన శైలిలో బౌలింగ్ చేస్తుండటంతో బ్యాటర్లకు చుక్కలే కనిపిస్తున్నాయి. మనకు విజయం నల్లేరు నడకలా సాగుతోంది. ఇక రాబోయే మ్యాచుల్లో కూడా విజయాలు దక్కించుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.