Lunar Eclipse: అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడింది. నవంబర్ 8న చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడటం ప్రతికూలత ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. చంద్ర గ్రహణం భారత దేశంతో పాటు ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్ మహా సముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో ఈ గ్రహణం వీక్షించొచ్చు. చంద్ర గ్రహణం ఈ ఏడాది చివరిది కావడం కావడంతో దీనిపై పండితులు పలు సూచనలు చేస్తున్నారు. చంద్ర గ్రహణం సాయంత్రం 5.30 గంటల నుంచి 6.19 గంటల వరకు గంటన్నర సేపు పడుతుంది. దీంతో దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

రెండు గ్రహణాలు పదిహేను రోజుల వ్యవధిలో రావడంతో అరిష్టమే అని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య పండితులు గ్రహణాల ప్రభావంతో ప్రపంచం మొత్తం మీద చెడు ప్రభావం కలుగుతుందని సూచిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు పెరగనున్నాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించే అవకాశముంది. దేశాల మధ్య ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరనున్నాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై గొడవలు చెలరేగవచ్చు. వ్యాపార వర్గాలపై కూడా ప్రభావం చూపనుందని పండితులు చెబుతున్నారు.
హిందూ ధర్మం ప్రకారం గ్రహణం వల్ల జీవితంలో కొన్ని ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుందని నమ్ముతారు. గ్రహణం చెడు ప్రభావాలను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు కూడా సూచించారు. గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు చేయరాదు. ఆలయాలు మూసి ఉంచుతారు. భోజనం చేయకూడదు. గ్రహణానికి ముందు తయారు చేసిన వంటలను తినకూడదు. మిగిలి ఉంటే పడేయాలి. చంద్ర గ్రహణం తరువాత ముందు స్నానం చేసి ఇంట్లో గంగాజలం చల్లుకుంటే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని చెబుతున్నారు.

గ్రహణాల సందర్భంగా ఏర్పడే ప్రభావాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రహణాలు కొన్ని రాశులపై ప్రత్యక్షంగా మరికొన్ని రాశులపై పరోక్షంగా ప్రభావం చూపనున్నాయి. దీంతో మనం మన పెద్దలు సూచించిన విధంగా పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని అనవసరంగా ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు. గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని చిన్న పాటి పరిహారాలు తీసుకుని గ్రహణ ప్రభావం మనపై పడకుండా చూసుకుంటే మంచిది.