TVS Motor: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్లు.. ఏం బైక్ రా బై ఇదీ

టీవీఎస్ ఎక్స్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లతో ప్రయాణించవచ్చు. అయితే కేవలం 50 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఫాస్టస్ట్ చార్జింగ్ సిస్టమ్ అలరిస్తుంది.

Written By: Chai Muchhata, Updated On : August 24, 2023 6:38 pm

TVS Motor

Follow us on

TVS Motor: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లను పలు కంపెనీలు ఇప్పటికే కొన్ని మోడళ్లను రోడ్లపై తిప్పుతున్నారు. తాజాగా టీవీఎస్ కంపెనీ నుంచి తాజాగా అప్డేట్ ఫీచర్స్ తో మోడ్రన్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడున్న ఈయూ స్కూటర్ల కంటే దీని ఫీచర్స్ అడ్వాన్స్ గా ఉండడంతో పాటు ఆకర్షణీయంగా కనిపించడంతో వాహన ప్రియులు దీనిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఈ స్కూటర్ విశేషాలు తెలుసుకుందాం..

TVS కంపెనీ ఇప్పటికే ఐ క్యూబ్ అనే ఈయూ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త మోడల్ తో మార్కెట్లోకి రానుంది. దాని పేరు TVS X. మాక్సీ స్టైల్ ఫార్మాట్ లో ఉత్పత్తి చేసిన ఈ స్కూటర్ అడ్వాన్స్ ఫీచర్స్ ను కలిగి ఉంది. ఇందులో ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్ స్ట్రమెంట్ క్లస్టర్ సైజ్ 10.25 అంగుళాలు ఉంటుంది. ఈ స్కూటర్ లో ఒకటి ఎక్స్ తీల్త్ ఎక్స్ ట్రైడ్, ఎక్స్ ఓనిక్ అనే మూడు మోడల్స్ ఉన్నాయి. అలాగే ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు కలిగి ఉన్నాయి.

టీవీఎస్ ఎక్స్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లతో ప్రయాణించవచ్చు. అయితే కేవలం 50 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఫాస్టస్ట్ చార్జింగ్ సిస్టమ్ అలరిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.44 కేడబ్ల్యూ హెచ్ డ్యూయెల్ బ్యాటరీ ప్యాక్ తో కలిగి డస్ట్, వాటర్ ఫ్రూఫ్ రేటింగ్ తో అలరిస్తుంది.

మోడ్రన్ డే టెక్నాలజీతో తయారు చేసిన టీవీఎస్ ఎక్స్ ధర రూ.2.5 లక్షలతో విక్రయిస్తున్నారు. ప్రీమియం క్యాటగిరీకి చెందినందున దీని ధర కొంచెం కాస్ట్లీగానే ఉంది. వచ్చే నవంబర్ నుంచి డెలివరీ ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పుడు బుక్ చేసుకోవడానికి కంపెనీ అవకాశం ఇచ్చింది. ఇతర వెబ్ సైట్లో కాకుండా టీవీఎస్ కంపెనీ తన వెబ్ సైట్ ద్వారానే దీని అమ్మకాలుప్రారంభించింది.