Truecaller: ట్రూ కాలర్ కు ప్రత్యామ్నాయంగా ట్రాయ్ కొత్త విధానం.. కాల్ చేసిన వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు. .

అయితే ట్రూ కాలర్ యాప్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇది అచ్చం ట్రూకాలర్ వలె పనిచేస్తుంది. అదేంటంటే?

Written By: Srinivas, Updated On : February 27, 2024 3:33 pm

true caller

Follow us on

Truecaller:ఈరోజుల్లో చేతిలో మొబైల్ లేని వారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ తప్పనిసరిగా మారింది. అయితే మొబైల్ యూజ్ చేయడం వల్ల ఎంత ఉపయోగమో.. కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. డిఫరెంట్ వేరియంట్ నుంచి కాల్స్ వస్తూ ఇబ్బందికి గురి చేస్తుంటాయి. ఈ క్రమంలో చాలా మంది ట్రూ కాలర్స్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని ఆ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో ముందే తెలుసుకుంటారు. అయితే ట్రూ కాలర్ యాప్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇది అచ్చం ట్రూకాలర్ వలె పనిచేస్తుంది. అదేంటంటే?

స్మార్ట్ మొబైల్ ఉన్న వారికి స్పామ్ కాల్స్ బెడద కచ్చితంగా ఉంటుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ట్రిక్స్ ఫాలో అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాయ్ త్వరలో ఒక కొత్త విధానాన్ని తీసుకురానుంది. అదే Call Name Presentation(CNAP). దీని ద్వారా ప్రతీ మొబైల్ లో ట్రూకాలర్ అవసరం లేకుండానే ఫోన్ చేసే వ్యక్తి వివరాలు డిస్ ప్లే అవుతాయి. అంతేకాకుండా అతని పేరు కనిపిస్తుంది.

అయితే దీనిని వినియోగదారులకు అందించే క్రమంలో ముందుగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ను చందాదారులుగా చేరుస్తుంది. ఆ తరువాత వినియోగదారుల వివరాలను సేకరించిన తరువాత టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కు పంపుతారు. ఆ తరువాత వినియోగదారులకు అనుగుణంగా అందుబాటులో ఉంచుతారు. దీని ద్వారా కాలింగ్ ఆపరేటర్ యొక్క డేటా రిసీవర్ తెలుసుకోవడానికి యాక్సెస్ చేస్తారు.

దీనిని యాక్సెస్ చేసుకోవడానికి వినియోగదారులు టెలికాం సర్వీసెస్ కు తెలియజేయాల్సి ఉంటుంది. 2018 లో డిపార్టమెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేన్స్ రూపొందించన ప్లాన్ ఆధారంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న మొబైల్ ద్వారా ఫోన్ చేసే వ్యక్తి డేటా తెలుసుకోవడానికి వీలుండదు. కానీ కాల్ నేమ్ ప్రజంటేషన్ ను మొబైల్ లోకి వచ్చిన తరువాత మోసపూరిత కాల్స్, స్పామ్స్ కాల్స్ ను ముందుగానే పసిగట్టి వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.