Trending Date: ఈరోజుల్లో డేటింగ్ అనేది ఒక ట్రెండ్‌లా మారిపోయింది. ఒకప్పుడు రోజుల్లో ప్రేమ అంటే ఏంటో కూడా పెద్దగా తెలియదు. కానీ ఈరోజుల్లో స్కూల్ పిల్లలు నుంచే ప్రేమ వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి. తెలిసి తెలియని వయస్సులో చాలా మంది డేటింగ్ చేస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా వాడకం బాగా పెరగడంతో అందరూ ఎక్కువగా డేటింగ్ చేస్తున్నారు. కొన్ని రోజులు డేటింగ్ చేసి నచ్చితే పెళ్లి చేసుకుంటారు. లేకపోతే లేదన్నట్టుగా ప్రస్తుతం యువత ఉంది. అయితే డేటింగ్ చేయడం వల్ల కొందరికి వాళ్లతోనే పెళ్లి అవ్వచ్చు. కానీ అందరికీ ఇలా జరగదు. చాలా మంది కొన్ని రోజులు మాత్రమే ఉంటున్నారు. మళ్లీ ఇంకో కొత్తవాళ్లని చూసుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కొత్త కొత్త డేటింగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల పైనాపిల్ ట్రెండ్ అనేది ఒకటి బాగా వైరల్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు సబ్‌మెరైన్ డేటింగ్ అనేది ట్రెండ్ అవుతుంది. ఇంతకీ సబ్‌మెరైన్ డేటింగ్ అంటే ఏమిటి? పూర్తి స్టోరీ తెలియాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
ఈ రోజుల్లో రిలేషన్లు ఎలా ఉన్నాయంటే కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటున్నారు. ఒక వ్యక్తి పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులు డేటింగ్‌లో ఉంటారు. రోజూ కలవడం, కొన్ని నెలల పాటు రిలేషన్‌లో ఉండటం, కాల్స్ మాట్లాడటం అన్ని చేస్తారు. కానీ ఒక్కసారిగా కాల్స్, మెసేజ్ చేసుకోవడం మానేస్తారు. ఇన్ని రోజులు ఉన్న ప్రేమ ఏం గుర్తుండక అసలు ఇద్దరికి సంబంధం లేనట్లు ఉంటారు. ఇలా కొన్ని నెలలు లేదా వారాలు ఉంటారు. అలా అని పూర్తిగా మర్చిపోతారా? అంటే అలా ఉండదు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత సడెన్‌గా రిలేషన్‌లోకి వెళ్తారు. మళ్లీ కాల్స్ మాట్లాడుకోవడం, చాటింగ్‌లు చేసుకోవడం, బయట తిరగడం వంటివి చేస్తారు. గతంలో కాస్త బిజీగా ఉన్నా అందుకే మెసేజ్ చేయలేకపోయానని అబద్ధాలు చెబుతారు. సబ్‌మెరైన్‌లో ఎలా కొన్ని రోజులు కనిపించి మళ్లీ డ్యూటీ చేస్తారో.. అలాగే కొందరు మనుషులు సడెన్‌గా ప్రత్యక్షమవుతారు. సబ్‌మెరైన్‌లో అకస్మాత్తుగా కనిపించడాన్నే సబ్‌మెరైన్ డేటింగ్ అంటారు.
ఈ డేటింగ్‌లో ఉండటం వల్ల ఎలాంటి సంతోషం ఉండదు. ఎక్కువగా ఆందోళన, బాధ ఉంటాయి. అసలు ఇది బంధం అనే ఫీలింగ్ ఉండదు. కనీసం మనశ్సాంతి ఉండదు. ఈ డేటింగ్‌లో ఉండకపోవడమే బెటర్. చాలా మందికి తెలియక ఏం చెప్పిన కూడా గుడ్డిగా నమ్మేస్తారు. ఇలా నచ్చినప్పుడు మాట్లాటం, లేకపోతే ఇతరుల ఫీలింగ్స్ పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇలాంటి రిలేషన్‌లో ఉండటం కంటే సింగిల్‌గా ఉండటం బెటర్. ఎందుకంటే ఫేక్ రిలేషన్ కంటే రియల్ రిలేషన్‌లో ఉండటం మంచిది. ఎందుకంటే ఇలాంటి రెడ్ ఫ్లాగ్ పర్సన్‌తో జీవితాంతం కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటం ఉత్తమం. ఇలాంటి రిలేషన్‌లు ఎక్కువ రోజులు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటారు. కాబట్టి దూరంగా ఉండటం బెటర్ అని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Trending date aware of the submarine dating trend why are young people attracted
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com