Train : భారతీయ రైల్వేలో చాలా సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన రవాణా వ్యవస్థ. దేశంలో ప్రతిరోజు కోట్లాదిమంది ప్రయాణికులు భారతీయ రైల్వేల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. రైల్వేలకు సంబంధించి ఇలాంటివి చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే వీటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రైలు మధ్యలో ఏసీ కోర్సులు ఉండడం మీరు రైలులో ప్రయాణించే సమయంలో చూసే ఉంటారు. ఒక రైలుకి ఇంజన్ తర్వాత కొన్ని జనరల్ కోర్సులు మరియు ఆ తర్వాత ఏసీ కోచ్ లో ఉంటాయి. అయితే మధ్యలో ఏసీ కోచ్ లను ఎందుకు ఏర్పాటు చేస్తారో చాలామందికి తెలియదు. రైలుకి ఇంజన్ తర్వాత జనరల్ కోచ్ లను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఏసీ కోచ్ లు మరియు స్లీపర్ కోచ్ లు ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ స్లీపర్ కోచ్ లను జనరల్ కంపార్ట్మెంట్ లతో జత చేస్తారు. అయితే రైలు మధ్యలోనే ఏసీ కోచ్లు ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం. దీని గురించి భారతీయ రైల్వేలు ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని తెలుపలేదు. కానీ దీని వెనుక ఒక సైంటిఫిక్ కారణం ఉందని తెలుస్తుంది. ఒక రైల్వే అధికారి చెప్పిన వివరాల ప్రకారం స్లీపర్ మరియు ఏసీ కోచ్ ఇలా కంటే రైలు జనరల్ కోచ్ లో రవి ఎక్కువగా ఉంటుంది.
Also Read : ఏసీని ఆపేటప్పుడు చేసే ఈ ఒక్క తప్పుతో లక్షల్లో నష్టం!
రైలులో ఉండే జనరల్ కోచ్ లలో ప్రతి స్టేషన్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు అలాగే దిగుతూ ఉంటారు. ఈ క్రమంలో రైలుకి ముందు మరియు వెనుక జనరల్ కంపార్ట్మెంట్లను అమర్చడం వలన ప్రయాణికుల రద్దీ సమానంగా విభజించేలాగా ఉంటుంది అని తెలుస్తుంది. ఈ విధంగా చేయకపోతే స్టేషన్ మధ్యలో గుంపులు గుంపులుగా జనం ఉన్నట్లయితే రైల్వే స్టేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే రైలుకి ముందు మరియు వెనుక జనరల్ కోచ్ లను అమర్చడం ద్వారా రైలు బ్యాలెన్స్ కూడా సరిగ్గా ఉంటుంది. ప్రతి రైలులో కూడా జనరల్ కోచ్ లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ జనరల్ కోచ్లు రైలు మధ్యలో ఉంటే అత్యధిక రోడ్డుతో రైలు మొత్తం బ్యాలెన్స్ తప్పుతుంది.
ఈ క్రమంలో రైలు ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు కూడా సమస్యలు ఏర్పడతాయి. మధ్యలో జనరల్ కోచ్ ఉండడం వలన సిట్టింగ్ అరేంజ్మెంట్ తో పాటు మిగిలినవి కూడా చెల్లాచెదురుగా మారతాయి. అందుకే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే రైలుకి రెండు చివరలో జనరల్ కోచ్ లను ఏర్పాటు చేసింది. అలాగే ఏసీ కోచ్ లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు సులభమైన మరియు అత్యంత సౌకర్యవంతమైన సౌకర్యాలను అందించడానికి నిపుణులు వీటిని మధ్యలో అమర్చినట్లు చెప్తున్నారు. మధ్యలో ఏసీ కోచ్ లో ప్రయాణించే ప్రయాణికులు తక్కువ రద్దీని ఎదుర్కొంటారు.