Parent-Child Relationship: చిన్నపిల్లలపై అతి ప్రేమ అనర్థదాయకమే. అతి ఏదైనా కష్టమే.చిన్న పిల్లల్లో మానవతా విలువలు పెంచే ప్రయత్నం చేయాలే కానీ ప్రేమ చూపించడం సరికాదు. మానవ సంబంధాల్లో నైతికత లోపిస్తోంది. ఒకప్పుడు ఉన్న ఉమ్మడి కుటుంబాలు దూరం కావడంతో చిన్న కుటుంబాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం పరిమిత కుటుంబాలే మనుగడలో ఉండటం తెలిసిందే. దీంతో పిల్లలకు ఏది మంచో ఏది చెడో తెలియడం లేదు. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు మనుషుల్లో సంబంధాలు దెబ్బతింటున్నాయి

పూర్వ కాలంలో ఉమ్మడి కుటుంబాల్లో అనురాగాలు, ఆప్యాయతలు కొట్టొచ్చినట్లుగా కనిపించేవి. అప్పటి కుటుంబాల్లో ప్రవర్తన అలా ఉండేది కాలక్రమేణా మనుషుల్లో ఓపిక, సహన నశిస్తున్నాయి. క్షణికావేశాలకు లోనై అయినవారినే కడతేర్చే వరకు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మానవ సంబంధాలు ఆర్థిక బంధాలుగానే పరిణమిల్లుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. దానికి తగినట్లు సంఘటనలు కూడా తారసపడుతున్నాయి. చిన్న నాటి నుంచే పిల్లలకు మానవతా విలువలపై ప్రత్యేకమైన స్థానం అవసరం ఉందని తెలుస్తోంది.
Also Read: Wisden : విజ్డెన్ : 2021లో 10 బెస్ట్ ‘క్రికెట్’ చిత్రాలు
చిన్ననాటి నుంచే మారాం చేస్తే గారాభంగా చూడటం మంచది కాదు. అది వారిలో డామినేషన్ చేసే విధంగా మార్చుతుంది. చివరకు బ్లాక్ మెయిల్ చేసే వరకు తీసుకెళ్తుంది ఇది కావాలి అది కావాలి అంటూ అన్ని తీర్చుకోవడమే అలవాటుగా మారుతుంది. అంతే కాని వారిలో ఎలాంటి నైతిక పరివర్తన ఉండదు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు చిన్న నాడు కనిపించే సిరిగల్ల గుణం అంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారిని దారిలో పెట్టాలి. అన్నినేర్పించాలి. నలుగురిలో మంచి నడవడిక ఉండేలా మసలుకోవాలనితెలియజేయాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుత నాగరికత ప్రపంచంలో మానవ విలువలు నశిస్తున్నాయి. స్వార్థం, సంకుచితం నిలువెల్లా వ్యాపిస్తున్నాయి. ఏదైనా చేయాలంటే అందులో లాభాన్ని మాత్రమే చూస్తున్నారు కానీ దానివల్ల కలిగే ప్రయోజనాలను లెక్కలోకి తీసుకోవడం లేదు. దీనికి అడ్డుకట్టవేయాల్సిన బాధ్యత మనలోనే ఉంది. సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందరు మాకెందుకులే అనుకుంటూ ఇంత నష్టం చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పటికైనా మనం మారి సమాజాన్ని ఉద్ధరించే పనిలో నిమగ్నం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది,
Also Read:Rashmika Mandanna: ఆలియా ప్లేస్ కొట్టేసిన రష్మిక.. ఇది ఎన్టీఆర్ కి షాకే !
Recommended Videos: