Solar Eclipse 2022- Srikalahasti Temple: నేడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు ఉంటుందని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలను మూసి వేస్తున్నారు. కొన్నింటిని ఉదయం 8 గంటల నుంచి మరికొన్నింటిని 11 గంటలకు మూసి వేస్తున్నారు. గ్రహణం సమయంలో ఆలయాలను ఎందుకు మూసివేస్తారు? ఎంతసేపు మూసివేస్తారు? సంప్రోక్షణ ఎప్పుడు చేస్తారు? వంటి అనుమానాలు అందరిలో రావడం సహజమే. ఇందుకు సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గ్రహణ సమయంలో దేశంలోని అన్ని ఆలయాలను మూసివేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిని మాత్రం తెరిచే ఉంచుతారు. అక్కడ పూజలు కూడా నిర్వహించడం గమనార్హం. ఈ రోజు దాన్ని మాత్రం ఎందుకు తెరిచి ఉంచుతారు? అందులో ఉన్న మర్మం ఏమిటి? శ్రీ అంటే సాలెపురుగు, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు అని అర్థం. ఈ మూడు జంతువులు ఇక్కడ పూజలు చేసి శివుడిలో ఐక్యం కావడంతోనే శ్రీకాళహస్తికి ఆ పేరు వచ్చిందని చెబుతున్నారు. ఈ దేవాలయంలో రాహు, కేతువులు ఉండటం వల్ల దీన్ని మూసివేయరు. గ్రహణం సమయంలో సూర్యచంద్రులకు అడ్డంగా వచ్చేది రాహువు కావడంతో ఇక్కడ దేవుళ్లకు ఎలాంటి ప్రతిబంధకం లేదనే ఉద్దేశంతోనే పూజలు చేస్తుంటారు. గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచడం గమనార్హం.
తల్లి గర్భం వలె దేవుడి గర్భగుడి కూడా పవిత్రమైన స్థలం. దీంతో గ్రహణ సమయంలో దుష్టశక్తులు ఆవహిస్తాయనే ఉద్దేశంతోనే దేవాలయాలను మూసివేయడం ఆనవాయితీ. తల్లి గర్భంలో ఉండే శిశువును రక్షించినట్లే దేవుడిని కూడా దుష్ట శక్తుల ప్రభావం పడకూడదనే కారణంతో ఆలయాలను మూసి వేస్తుంటారు. గ్రహణం పట్టే రోజున అన్ని దేవాలయాలను మూసి వేసి తరువాత రోజు తెరిచి సంప్రోక్షణ చేసి భక్తులను అనుమతిస్తారు. గ్రహణ సమయంలో బ్రాహ్మణులు అగ్నిహోత్రం, సంధ్యావందనం చేస్తుంటారు. అవి ఇంట్లో ఉండే చేస్తారు.

దేవాలయాల్లో పూజలు చేసే బ్రాహ్మణులు గ్రహణ హోమాలు ఇంట్లో చేయడం వీలు కాదు. అందుకే దేవాలయాలను మూసి వేసి ఇంట్లోనే నిత్యకర్మలు చేయడానికి వాటిని మూసి వేస్తారనే మరో ప్రచారం కూడా ఉంది. దీంతో బ్రాహ్మణులు స్వధర్మాన్ని పాటించడానికి గ్రహణ సమయంలో దేవాలయాలను మూసి వేస్తారని చెబుతున్నారు. గ్రహణ సమయంలో గుళ్లను మూసివేసి ఉంచి ఆగమ శాస్త్ర ప్రకారం హోమాలు చేస్తుంటారు. దీంతో గ్రహణాల సమయంలో దేవాలయాలను మూసి వేసే ఆచారం ఏర్పడింది