Telugu New Movies Release Date: దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్న పిల్లలు బాణ సంచాతో సందడి చేశారు. అయితే సినీ ఇండస్ట్రీలో కూడా ఈ దీపావళికి టపాసులు మోత మోగించాయి. ఈ పండుగ సందర్భంగా సినీ విశేషాలు చాల వచ్చాయి. కొత్త సినిమాలకు సంబంధించిన కబుర్లు ఆయా సినిమాల బృందం అందించి ప్రేక్షకుల్లో సంతోషాన్ని నింపింది. ముఖ్యంగా చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ ఖరారు చేసి టీజర్ ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇచ్చినట్లయింది. అటు రవితేజ నటిస్తోన్న ‘ధమాకా’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి రాబోతుంది. శృతిహాసన్ తో పాటు ఇందులో స్టార్ నటుడు రవితేజ కీలక పాత్రలో పోషిస్తున్నాడు. దీపావళి సందర్భంగా టైటిల్ ను అఫీషియల్ గా అనైన్స్ చేశారు. అలాగే సినిమాలోని ఓపార్ట్ ను టీజర్ గా బయట పెట్టారు. ఇందులో చిరంజీవి మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. చాలా రోజలు తరువాత మెగాస్టార్ ను ఇలా చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ అప్డేట్ ను దీపావళి సందర్భంగా అందించారు. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న రవితేజ ‘ధమాకా’లోనూ అంతే పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీని డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ చేశారు. ఇందులో రవితేజకు జోడిగా ‘పెళ్లిసందడి’ హీరోయిన్ శ్రీ లీల నటిస్తోంది. ప్రసన్నకుమార్ బెజవాడ మాటలు అందిస్తున్నారు. దీపావళి రవితేజ నటిస్తున్న మరో మూవీ అప్డేట్ అందించారు. ‘రావణాసుర’ ను ఏప్రిల్ 7 2023న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు.

వీటితో పాటు సమంత నటిస్తున్న యశోధ, ధనుష్ నటిస్తున్న సార్, సుధీర్ బాబు చేస్తున్న హంట్ మూవీస్ అప్డేట్ వచ్చాయి.అక్కినేని అఖిల్ సినిమా సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ కూడా అప్పుడే రిలీజ్ కాబోతున్నట్లు దీపావళి సందర్భంగా ప్రకటించారు. ఈసారి సంకాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’తో పాటు మిగతా సినిమాలుకూడా సందడి చేసే అవకాశం ఉంది.