https://oktelugu.com/

Car: కారు భారం కాకుండా ఉండాలంటే.. ఇవి కచ్చితంగా పాటించండి.

కొత్త కారు కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చాలా మంది బైక్ లు, స్కూటర్లను పక్కనబెట్టి వాటి స్థానంలో సొంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. చిన్న ఫ్యామిలీ టూర్ కు వెళ్లాలని అనుకుంటే కచ్చితంగా కారు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కారు కొనాలని ఆశ ఉన్నా.. ఒక్కో సమయంలో తగినంత బడ్జెట్ ఉండదు.

Written By:
  • Srinivas
  • , Updated On : December 17, 2024 / 11:47 AM IST

    Car

    Follow us on

    Car: కొత్త కారు కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చాలా మంది బైక్ లు, స్కూటర్లను పక్కనబెట్టి వాటి స్థానంలో సొంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. చిన్న ఫ్యామిలీ టూర్ కు వెళ్లాలని అనుకుంటే కచ్చితంగా కారు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కారు కొనాలని ఆశ ఉన్నా.. ఒక్కో సమయంలో తగినంత బడ్జెట్ ఉండదు. ఈ తరుణంలో లోన్ ద్వారా కారు కొనాలని చూస్తారు. ఈ మధ్య లోన్ ద్వారా కారు కొనాలని అనుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఎలాంటి డౌన్ పేమేంట్ చేయకుండా కారును ఇంటికి తీసుకెళ్లండి.. అని చెబుతూ ఉంటాయి. కానీ ఇలా ఆపర్లు ఇస్తున్నారు కదా.. అని టెమ్ట్ కాకండి.. ఒక్కసారి ఆగి ఈ రూల్ ను పాటించండి. అదేంటంటే?

    చేతిలో ఒక్క రూపాయి లేకున్నా కారును ఇంటికి తీసుకెళ్లే విధంగా వచ్చే ఆఫర్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తగా ఉండాలి. ఎందుకంటే బ్యాంకు లోన్ ద్వారా కారు కొనాలని అనుకున్నప్పుడు ఈ రూల్ కచ్చితంగా పాటించాలి. అదే 20-4-10.. ఇది చూడ్డానికి డేట్ లాగా అనిపించినా.. దీనిని పాటించి కారు కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకుంటే కొత్త కారును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ రూల్ ఎంటి? పాటించకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయి? ఆ వివరాల్లోకి వెళితే..

    20-4-10 రూల్ లోమొదటిది 20.. కొత్త కారు ఏదైనా కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు మిడిల్ క్లాస్ వారు అయితేబడ్జెట్ ను చూస్తారు. అయితే అనుగుణంగా ఉండే బడ్జెట్ లో కారు వస్తున్నా.. లోన్ ద్వారా కారును కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం కచ్చితంగా డౌన్ పేమేంట్ చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు డౌన్ పేమేంట్ లేకున్నా.. కారును విక్రయిస్తామని చెబుతారు. కానీ ఇలా అస్సలు తీసుకోవద్దు. కచ్చితంగా కారు ఖరీదులో 20 శాతం డౌన్ పేమేంట్ చెల్లించాలి. ఉదాహరణకు కారు ధర రూ.10 లక్షలు ఉంటే.. అందులో 20 శాతం అంటే 2 లక్షలు కచ్చితంగా చెల్లించాలి.

    రెండో రూల్ 4.. బ్యాంకు లోన్ ద్వారా కారు కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు టెన్యూర్ ను 4 సంవత్సరాల పాటు మాత్రమే తీసుకోండి. కొన్ని బ్యాంకులు ఎక్కువ కాలం పాటు టెన్యూర్ కు అవకాశం ఇస్తారు. ఎక్కువ కాలం నిర్ణయించుకుంటే వడ్డీ భారం అధికంగా ఉంటుంది. ఒక వేళ పిక్స్ డ్ వడ్డీ రేటు కాకుండా పరిస్థితులను బట్టి వడ్డీ భారం అధికంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల 4 సంవత్సరాల టెన్యూర్ మాత్రమే నిర్ణయించుకోవాలి.

    ఇక మూడో రూల్ 10.. ఆదాయం అందరికీ ఒకేలా ఉండదు. వారికి ఉన్న ఆదాయాన్ని బట్టే కారు కొనుగోలు చేయడానికి ముందుకు రావాలి. ఈ క్రమంలో కారు కొనాలని అనుకునే వ్యక్తి తనకు వచ్చే ఆదాయంలో 10 శాతం మాత్రమే కారు కోసం ఈఎంఐ కేటాయించుకోవాలి. ఉదాహరణకు రూ.లక్ష రూపాయల జీతం ఉంటే.. ఇందులో 10 శాతం అంటే రూ.10,000 ఈఎంఐకి కేటాయించడానికి అనుగుణంగా ఉంటేనే కారు కొనుగోలు చేయడానికి ముందుకు వెళ్లాలి. అప్పుడే కారు భారంగా మారకుండా ఉంటుంది