TTD: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు. వడ్డీకాసులవాడు. శ్రీవారికి ప్రతిరూపమైన వెంకటేశ్వరుడిని కొలిచేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. వారి సేవల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకుంటుంది. పాలకవర్గం ప్రతి ఏటా సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు ఆమోదిస్తుంది. ఇందులో భాగంగా తిరుమలకు కాలినడకన వచ్చే వారికి టోకెన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీంతో కాలినడకన వచ్చే భక్తుల కష్టాలు తొలగుతాయి.

ఈ నెల 5 నుంచి కాలినడకన వచ్చే భక్తులకు అనుమతి ఇచ్చేందుకు నిర్ణయించారు. బాలాజీ నగర్ వద్ద ఉన్న స్థలంలో ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీంతో ప్రయాణికుల కష్టాలు కూడా తీరనున్నాయని తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల వసతి గృహాల ఆధునీకరణకు రూ. 19 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల గృహాలు మరమ్మతులు చేయించి మంచి హంగులతో రూపుదిద్దుకోనున్నాయి.
Also Read: సూర్య గ్రహణం తరువాత ఈ రాశులు వారికి పట్టిందల్లా బంగారమే?
మహారాష్ట్రలోని నవీ ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం పది ఎకరాల స్థలం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనికి గాను అక్కడి మంత్రి అందుకు సంబంధించిన భూమి పత్రాలను వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఆలయ నిర్మాణానికి రేమండ్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో పనులు ప్రారంభించనున్నారు. ఇంకా పాలకమండలి కొన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా ఆమోదించింది.
భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కాలం దృష్ట్యా భక్తుల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నాయి. అందుకే వచ్చే వారికి ఎక్కడ కూడా ఇబ్బందులురాకుండా చూసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం పనికిరాదని చెప్పారు. ఉద్యోగులు తమ విధులు సక్రమంగా నిర్వహించి సేవలు చేయాలని తెలిపారు.
Also Read: రేపే శని అమావాస్య.. ఈ తప్పులు చేయొద్దు.. అసలేం చేయాలంటే?
[…] Also Read: తిరుమల నడక భక్తులపై కీలక నిర్ణయం […]
[…] AP Employees: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. దీంతో లాక్కోలేక పీక్కోలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చారు.కానీ అవి నెరవేర్చేందుకు సత్తా చాలడం లేదు. ఇందులో భాగంగానే ఇచ్చిన హామీల్లో సీపీఎస్ రద్దు ఒకటి. ఇప్పుడు అది ఏకు మేకై కూర్చుంది. సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. సర్కారుకు తలనొప్పిగా మారింది. ఉద్యోగులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు.దీంతో ప్రభుత్వం డోలాయమానంలో పడింది. ఇస్తే ప్రభుత్వానికి తంటా ఇవ్వకపోతే ఉద్యోగులతో మంట ఏం చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. సీపీఎస్ రద్దు వీలు కాదని సజ్జలతో చెప్పించినా వారు మాత్రం వినిపించుకోవడం లేదు. […]
[…] Pawan Kalyan: ఓపిక ఉన్నన్నీ నాళ్లు సహిస్తాం.. భరిస్తాం.. కానీ బరెస్ట్ అయితే మాత్రం ఇక వదిలేది లేదని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడు. అందుకే తాజాగా రూటు మార్చారు. ప్రతిసారి ఎంతో గౌరవంగా పలికే ఆయన సంభాషణల పరంపరను వైసీపీ నేతలే చెడగొడుతున్నారు. ఇన్నాళ్లు ‘శ్రీ జగన్ రెడ్డి’ గారు అంటూ జనసేన నుంచి ప్రకటనలు వచ్చేవి. ఇప్పుడు ఆ రాచమర్యాదలన్నింటిని పవన్ కళ్యాణ్ పక్కనపడేశారు. తన ప్రకటనల్లో ‘సీబీఐ దత్తపుత్రుడు’ అంటూ జగన్ కు కొత్త పేరు పెట్టేశారు. అదే ఇప్పుడు వైరల్ అయ్యింది. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. […]