Tips To Overcome Difficulties: జీవితమంటే పూల పాన్పు కాదు.. ఎన్నో ఒడిదుడుకులు కలిపిన ప్రయాణం. పుట్టినప్పటినుంచి మరణించే వరకు.. కష్టసుఖాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే కొందరు ఎలాంటి కష్టం లేకుండా జీవితాన్ని పూర్తిచేస్తే.. మరికొందరు మాత్రం నిత్యం కష్టాలను ఎదుర్కొంటూ లైఫ్ ను కొనసాగిస్తారు. అయితే కేవలం తమకు మాత్రమే బాధ ఉందని చెబుతూ మరింత కృంగిపోయేవారు చాలామంది ఉంటారు. వాస్తవానికి ప్రతి ఒక్కరికి కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి. కానీ కొందరు కష్టాలను లెక్కచేయకుండా ముందుకు వెళితే.. మరికొందరు కష్టాలను భారంగా ఫీల్ అయి ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే బాధలో ఉన్న వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి సరైన బలాన్ని ఎవరు ఇస్తారు? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి? అనే వివరాల్లోకి వెళ్తే..
తాము నిత్యం బాధలో ఉన్నామని బాధపడుతూ ఉండే కొందరు.. మరోవైపు తెలిసి తెలియక తప్పులు చేస్తూనే ఉంటారు. ఎదుటివారిని దూషించడమో.. ఇతరులను బాధ పెట్టడం వంటివి చేస్తుంటారు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా ఒకే మాటపై నిల్చునే వారికి ఆ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ ఒకే మాట అనేది సత్యం. నిత్యం సత్యవాక్కులు పలికేవారికి బాధ నుంచి బయటపడే బలం ఏర్పడుతుంది. తాను ఏ పరిస్థితుల్లో ఉన్న బయటపడడానికి సత్యం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.
Also Read: period pain : పీరియడ్స్ నొప్పి నుంచి విముక్తి చెందాలంటే.. ఇది తినాల్సిందే!
కొందరు తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఆ తప్పులకు శిక్ష పడే క్రమంలో బాధపడుతూ ఉంటారు. తాత్కాలికంగా ఆ బాధ నుంచి బయటపడిన తర్వాత.. మళ్లీ తప్పులు చేస్తూ ఉంటారు. ఇలా తప్పులు చేస్తూ పోయే వారికి ఎప్పటికీ బాధే ఉంటుంది. అలా కాకుండా ఒక తప్పు చేసిన తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుని.. ఆ తర్వాత నిబద్ధతతో సత్యం పలుకుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడే ధర్మం నిలబడుతుంది. ఇలా ధర్మాన్ని లేబట్టే వారికి దైవం కూడా సహాయం చేస్తుంది. ఫలితంగా ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనే బలం వస్తుంది.
కొందరు ఎన్నో తప్పులు చేస్తుంటారు. కానీ తాము దైవాన్ని కొలచడం ద్వారా పాపాలన్నీ కడుక్కోవచ్చని అనుకుంటారు. కానీ దేవుడు సైతం సత్యం పలుకుతూ.. ధర్మాన్ని కాపాడే వ్యక్తులను మాత్రమే రక్షిస్తూ ఉంటాడు. అలాకాకుండా ఒకవైపు తప్పులు చేస్తూ.. మరోవైపు పూజలు చేసినా.. వారికి ఎలాంటి ఫలితం ఉండగానే విషయాన్ని గ్రహించుకోవాలి. అయితే తమ పాపాలు కడుక్కున్నామని మళ్లీ మళ్లీ తప్పులు చేసే వారికి మాత్రం జీవితాంతం కష్టాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తికి కష్టం వచ్చిన తర్వాత సుఖం ఏర్పడుతుంది. అయితే ఈ ఆనంద సమయంలో వారు తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటారు. అలా తెలియకుండా కూడా తప్పులు చేయకుండా నిజం మాట్లాడుతూ.. నిజాయితీగా ఉండే వారికి ధర్మం తోడుగా ఉంటుంది. ఫలితంగా ఎలాంటి కష్టాల మంచైనా బయటపడేలా చేస్తుంది. అందువల్ల బాధలో ఉన్నప్పుడు.. కష్టాల్లో ఉన్నప్పుడు.. సత్యం పలికే అలవాటు చేసుకోవాలి..