Homeలైఫ్ స్టైల్Loss Fat : ఈ మూడింటితో పొట్టలో కొవ్వు కరగడం ఖాయమే?

Loss Fat : ఈ మూడింటితో పొట్టలో కొవ్వు కరగడం ఖాయమే?


Loss Fat :
చాలా మంది స్థూలకాయం, అధిక బరువు, పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆహార అలవాట్లే. జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, శీతల పానీయాలు, ఫిజాలు, బర్గర్లు వంటివి ఎడాపెడా లాగించేస్తున్నారు. బరువు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నారు. దీంతో అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయి. అధిక బరువు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇతర సమస్యలు వస్తున్నాయి. దీంతో వాటి నుంచి ఉపశమనం పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు. అనేక పద్ధతులు పాటిస్తున్నారు.

ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి మన ఇంట్లోనే తయారు చేసుకునే సులభమైన చిట్కా ఉంది. ఈ పానీయంతో అధిక బరువు సమస్య లేకుండా పోతుంది. దీని వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. జీలకర్ర, సోంపు, వామును ఉపయోగించుకోవాలి. ఒక జార్ లో ఒక టీ స్పూన్ వాము, ఒక టీ స్పూన్ సోంపు గింజలు, ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. వీటిని మెత్తగా పొడిగా చేసుకోవాలి.

ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు మోతాదులో నీటిని తీసుకుని ఇందులో మనం తయారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ వేసుకోవాలి. తరువాత చిన్న మంటపై ఐదు నిమిషాలు మరిగించాలి. తరువాత ఈ పానీయాన్ని వడకట్టి ఒక గ్లాసులోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజు ఉదయం పరగడుపున తాగాలి. తాగిన గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. దీంతో మనకు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పంపుతుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది.

ఈ పానీయాన్ని రోజు తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు రాకుండా పోతాయి. అధిక బరువు, పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఈ పొడి ఒకసారి తయారు చేసకుంటే నెల రోజుల పాటు వాడుకోవచ్చు. దీని వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు. అందుకే ఆరోగ్యాన్ని కోరుకునే వారందరు దీన్ని వాడుకుని తమ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించుకోవాలి. ఈ చిట్కాను ఉపయోగించుకుని అధిక బరువును తగ్గించుకుంటే మంచిది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Oktelugu Epaper
Exit mobile version