Pujas and Vratas: ఆషాఢం తరువాత పండుగల సీజన్ మొదలవుతుంది. శ్రావణ మాసం కూడా పూర్తి కావడంతో ఇప్పటి నుంచి పండుగ వెనుక పండుగలొస్తాయి. ఈ క్రమంలో కొన్ని వ్రతాలు కూడా చేస్తుంటారు. వ్రతాలు చేసేవారు, పూజల్లో పాల్గొనేవారు ఆహారం తీసుకోవద్దన నిబంధన ఉంటుంది. దీంతో చాలా మంది కేవలం నీటినే తీసుకుంటారు. కొందరు టీ, పాలు తీసుకుంటారు. కానీ ఇవి తీసుకున్నా నీరసంగా ఉంటారు. ఇలా నీరసమైన వారు ఒక్కోసారి చక్కెర నిల్వలు తగ్గి కిందపడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇలా చేయడం వల్ల ఆకలి వేయదు. నీరసం రాదు.
పూజలో పాల్గొనే ముందు పండ్లను తీసుకొవచ్చని అంటుంటారు. అయితే పండ్లు నేరుగా తినడం వల్ల ఆహారంతో సమానం అవుతుంది. దీంతో పూజలో పాల్గొంటే నిద్ర వస్తుంది. నిద్రిస్తూ పూజచేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు. అలాగని నీరసంతో దేవుడిని కొలిచినా అది వ్యర్థమే అవుతుంది. ఇలాంటప్పుడు పండ్లతో చేసిన జ్యూసులు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కాకుండా ఉంటారు. అయితే ఇవి సాధారణంగా కాకుండా కొన్ని ఫ్రూట్స్ ను కలిపి జ్యూస్ చేసుకొని తీసుకుంటే నీరసం దరిచేరదు.
సాధారణంగా పూజకు ముందు పాలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో రెండు అంజీర ప్రూట్స్, చెంచడు తేనే వేసుకొని తాగడం వల్ల ఎనర్జీగా ఉంటుంది. దీంతో పూజలో ఎంత సేపు పాల్గొన్నా ఎటువంటి నీరసం దరిచేరనీయదు. అంజీరలో ఉండే విటమిన్లు, పోషకాలు శరీరానికి ఎనర్జీని ఇస్తాయి. ఇందులో కార్పొహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి. అటు పాలలోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ రెండు మిక్స్ చేసుకొని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఇక జ్యూస్ తీసుకోవాలనుకునేవారు రెండు క్యారెట్లలో ఒక బీట్ రూట్ ముక్క, కీరదోస సగం వరకు కట్ చేసి మిక్స్ జ్యూస్ చేుకోవాలి. ఈ రసాన్ని వడబోసి ఇందులో పూదీనా, నిమ్మరం వేసుకొని తగాలి. ఇలా తాగడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. బార్లీ ఉన్నవారు ఒక గ్లాసు బార్లీలో నిమ్మరసం, వాము వేసి తొగొచ్చు. ఇలా చేసిన వాటిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దీంతో యాక్టివ్ గా ఉంటారు.