Suryakumar Yadav: టీ20 ప్రపంచ కప్ లో సూర్యకుమార్ యాదవ్ విజృంభిస్తున్నారు. పరుగుల వరద పారిస్తున్నాడు. ఏ బాల్ అయినా అయితే బౌండరీ లేకపోతే సిక్స్ గా మలుస్తూ బౌలర్లకు ముప్పతిప్పలు పెడుతున్నాడు. అతడి ఆట చూస్తే అందరికి ఆశ్చర్యం వేస్తోంది. ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. విపరీత ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. అతడి బ్యాటింగ్ చూస్తే నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 12 దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ల 360 డిగ్రీల్లో షాట్లు కొట్టడం వైరల్ గా మారింది. దీంతో మిస్టర్ 360 డిగ్రీస్ అనే పేరును సార్థకం చేసుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ ఖ్యాతి ఇనుమడిస్తోంది.

సూర్యకుమార్ యాదవ్ ఇలా ఆడటానికి ఓ కారణం కూడా ఉంది. అతడి డైట్ మెను మొత్తం మార్చుకున్నాడు. బలవర్ధకమైన ఆహారం తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. స్కూప్ షాట్లు కొట్టడంలో మాస్టర్ గా మారాడు. దీంతో అతడి బ్యాటింగ్ విన్యాసం చూసి ప్రేక్షకులు ముగ్దులవుతున్నారు. దీంతో సూర్యకుమార్ షాట్ల వెనుక ఉన్న రహస్యం ఏమిటనే సందేహం అందరిలో రావడం కామనే. ఆస్ట్రేలియాలో స్టేడియాలు 80-85 మీటర్లు ఉండటంతో బౌండరీ కూడా 75-80 మీటర్ల దూరం ఉంది. దీంతో వికెట్ల వినకాల 60-65 మీటర్ల దూరం ఉంది కాబట్టే షాట్లు సులభంగా కొట్టడానికి వీలయింది.
ఈ నేపథ్యంలో ఏ బాల్ అయినా సులభంగా ఎదుర్కోవడం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే భారీ షాట్లు కొట్టగలిగానని చెబుతున్నాడు. 360 డిగ్రీల్లో షాట్లు కొట్టడం నాకు అడ్వాంటేజీగా మారింది. అందుకే ఆ పేరు నాకు సార్థకం అవుతుందని తన మనసులో మాట వెల్లడించాడు. తిండి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఒమేగా 3 ఉండే ఆరోగ్యకరమైన పదార్థాలు, గుడ్లు, మాంసం, చేపల వంటి వాటిని తీసుకుంటూ తన శక్తిని పెంచుకుంటున్నాడు. ఇంకా అధిక ప్రొటీన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

శిక్షణ, మ్యాచ్ ల సమయంలో అతడి ప్రదర్శన పెంచేలా బూస్టింగ్ సప్లిమెంట్లు తీసుకుంటున్నాడు. జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లడం లేదు. డ్రైఫ్రూట్స్ ను తీసుకుంటున్నాడు. ఐస్ క్రీం, ఫిజ్జా, బిర్యాణీల వంటి వాటికి దూరంగా ఉంటున్నాడు. మంచి ఆహారం తీసుకుని తన శక్తిని పెంచుకుని ఆటలో అత్యుత్తమ ప్రదర్శన చూపిస్తున్నాడు. ఫలితంగా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఎలాంటి బంతినైనా సులభంగా ఎదుర్కొని షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. సక్సెస్ కూడా సాధిస్తున్నాడు.