WhatsApp: ప్రముఖ ప్రసార శాఖ దిగ్గజం వాట్సాప్. ప్రస్తుతం దీన్ని వాడకుండా ఉండలేకపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సాధనాలు ముఖ్యమైనవి. ప్రజలు ఏదో ఒక దాని మీదే ఆధారపడి ఉంటున్నారు. సమాచార ప్రచారంలో విస్తృతంగా ఇవి సేవలు అందిస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు వాటిని వాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక గంట నిలిచిపోతే దాని ప్రభావంత గణనీయంగానే ఉంటోంది. ఇదివరకు గతంలో కూడా పలుమార్లు వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు పరేషాన్ అయ్యారు. తాజాగా అక్టోబర్ 25న ఏమైందో ఏమోగానీ వాట్సాప్ సందేశాలు వెళ్లలేదు.

రెండు గంటల పాటు అంతరాయం చోటుచేసుకుంది. దీంతో అందరు సమస్యలు ఎదుర్కొన్నారు. వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అసౌకర్యానికి గురయ్యారు. కానీ అందుకు తగిన కారణాలు మాత్రం తెలియడం లేదు. ఇంత సమయం సమస్య తలెత్తడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో వెబ్ వాట్సా్ కనెక్ట్ కాకపోవడంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు. అంతరాయంతో అన్ని సేవలు నిలిచిపోయాయి. దీనికి వాట్సాప్ క్షమాపణలు సైతం చెప్పింది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది.
అంతరాయానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది. వాట్సాప్ కు జరిగిన అంతరాయంపై వాట్సాప్ ను వివరణ కోరింది. సాంకేతిక లోపమా? లేక సైబర్ దాడి ఏదైనా జరిగిందా? అనే కోణంలో విచారణ సాగిస్తోంది. వాట్సాప్ నుంచి ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కూడా వివరణ అడిగినట్లు తెలుస్తోంది. భారత్ కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కారణాలను వెతికే పనిలో పడింది.

వాట్సాప్ అంతరాయంపై కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ సైతం ధ్రువీకరించారు. వాట్సాప్ కు కలిగిన అంతరాయంతో దేశంలోని యాభై కోట్లకు పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో అంతరాయానికి గల కారణాలు ఏంటనే విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో వాట్సాప్ యాజమాన్యం వాటిని వెతికే పనిలో పడింది. వారంలోగా నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వాట్సాప్ అంతరాయంపై దాని నిర్వాహకులు ఏం చెబుతారోననే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.